తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవన్ కళ్యాన్.   ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ మొదట్లో కొన్ని ఫెయిల్యూర్ చిత్రాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఎస్.జె. సూర్య దర్శకత్వంలో వచ్చిన ‘ఖుషి’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఆ తర్వాత పవన్ కి వరుసగా హిట్ సినిమాలు వచ్చాయి.  మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘కొమరం పులి’ చిత్రం భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.  
ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన నికిషా పటేల్ తాజాగా పవన్ పై కొన్ని సంచలన కామెంట్స్ చేసింది. ‘కొమరం పులి’చిత్రంలో పవన్ సరసన నేను నటించాలనుకోలేదని ఎస్ జే  సూర్య పట్టుబట్టి తప్పకుండా సక్సెస్ అయి పెద్ద హీరోయిన్ అవుతావు నచ్చజెప్పడంతో బాలీవుడ్ ని కాదని పవన్ కళ్యాణ్ సరసన కొమరం పులి చిత్రంలో నటించానని చెప్పింది. కానీ ఆ సినిమా ఘోర పరాజయం పొందడంతో ఎటు కాకుండా పోయానని సంచలన వ్యాఖ్యలు చేసింది.  
అంతే కాదు 2010లో రిలీజ్ అయిన కొమరం పులి డిజాస్టర్ కావడంతో ఈ హాట్ బ్యూటీ కి తర్వాత  ఏ చిత్రాల్లో కూడా చాన్స్ దొరకలేదు.  దీంతో అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో చాన్సులు లేకుండా పోయింది.  చాలా రోజుల తర్వాత పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిశంకర్ తో ‘అరకు రోడ్’ చిత్రంలో నటించింది.  ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ కావడంతో  ఈ అమ్మడికి సినిమా చాన్సులు పూర్తిగా తగ్గిపోయాయనే చెప్పొచ్చు. 
 
Top