రాజకీయాలలో సినిమాలలో శాశ్విత శత్రువులు మిత్రులు ఉండరు అనే మాటలను ఈమధ్య ఒక ఫంక్షన్ లో కలిసిన చిరంజీవి రోజాలు మరొకసారి నిజం చేసారు.  గతంలో టాప్ హీరో హీరోయిన్ లుగా ఒక వెలుగు వెలిగిన వీరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.

అయితే సినిమాలను పూర్తిగా తగ్గించుకుని రాజకీయాల బాట పట్టిన వీరిద్దరూ ప్రస్తుతం రాజకీయంగా బద్ధ శత్రువులు. అవకాశం వస్తే చాలు ఒకరి పై ఒకరు మాటల సెటైర్లు వేసుకుంటూ మీడియాకు హాట్ టాపిక్ గా ఉంటారు.

అయితే వీరిద్దరూ ఈమధ్య జరిగిన జెమినీ టివి ఫంక్షన్ లో కలుసుకోవడమే కాకుండా ఒకరి పక్కన ఒకరు కూర్చుని అత్యంత ప్రేమను ఒలకపోస్తూ మీడియా కెమెరాలకు పోజు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.  అంతేకాదు చిరంజీవి తన వెనక వరసలో కూర్చుని ఉన్న రోజా కుమార్తెను తన దగ్గరకు పిలిచి అత్యంత ఆత్మీయంగా పలకరించడం ఆ జెమినీ టివి ఫంక్షన్ కు వచ్చిన అతిధుల అందరి మైండ్ బ్లాంక్ చేసింది.

రోజా చిరంజీవిని అతడి ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా విశేషాలు గురించి అడిగితే మెగా స్టార్ రోజాను ‘జబర్దస్త్’ షో విశేషాలను అడిగినట్లు టాక్.  అంతేకాదు వీరిద్దరు తమతమ పాత భేదాభిప్రాయాలను మరిచిపోయి సుమారు 10 నిముషాల వరకు ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.

ఈమధ్య కాలంలో చిరంజీవి తన పాత సన్నిహితులు అందరితోను సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు.  ముఖ్యంగా దాసరి మోహన్ బాబు రోజాల విషయంలో తనకు ఎటువంటి భేధాభిప్రాయాలు లేవు అని చెప్పడానికి అవకాసం దొరికినప్పుడల్లా వారితో తనకు గల సాన్నిహిత్యాన్ని వ్యక్తపరుస్తూనే వస్తున్నాడు.  ఇప్పుడు అటువంటి సందర్భమే మరొకసారి రిపీట్ అయింది అనుకోవాలి.. 
 
Top