తెలుగు ఇండస్ట్రీలో ఇద్దరమ్మాయిలు, నాయక్, మిర్చి లాంటి సినిమాలో హీరోయిన్ గా నటించిన కెరళ కుట్టి..బ్లాక్ బ్యూటీ అమలాపాల్.  ఈ అమ్మడు దాదాపు  తెలుగులో స్టార్ హీరోలతో జత కట్టింది. కానీ ఏ సినిమా కూడా ప్లస్ పాయింట్ కాలేక పోయింది. దీంతో తమిళ ఇండస్ట్రీనే నమ్ముకుంది..అంతే కాదు దర్శకుడు కె.ఎల్.విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అది కూడా ఏడాదిలోపే పెటాకులైంది. ఈ ప్రభావం తన భవిష్యత్‌పై పడనుందని అందరూ భావించారు. కానీ అవకాశాలు ఎప్పుడు ఆమె వెంటే ఉన్నాయి.
దీంతో ఈ అమ్మడు మళ్లి సినిమాలపై దృష్టి పెడుతుంది..ఈసారి కాస్త గ్లామర్ కి ప్రాధాన్యత ఎక్కువగానే ఇస్తుంది. ఇప్పుడు కోలీవుడ్ లో ఓ హాట్ టాపిక్ హల్ చల్ చేస్తుంది. రజినీకాంత్ అల్లుడు హీరో ధనుష్ అమ్మ కణక్కు', 'వాడా చెన్నై', 'వీఐపీ2'  చిత్రాల్లో అమలాపాల్ కి వరుస ఆఫర్లు ఇచ్చారు. ఈ సినిమాలు కూడా మంచి హిట్ గానే నిలిచాయి. దీంతో వీరిద్దరి మద్య అదేదో ఉందని పుకార్లు షికార్లు చేశాయి.
ఈ రూమర్లపై అమల స్పందిస్తూ..ధనుష్ నాకు మంచి స్నేహితుడు మాత్రమేనని.. ఆయనకు నాకు మధ్య ఏదో ఉందంటూ వస్తున్న పుకార్లు అవాస్తవమని కొట్టిపాడేసింది. అయితే తన భర్తతో ఉన్న మనస్పర్థాలను తొలగించాడానికి ప్రయత్నించిన వారిలో ధనుష్ కూడా ఒకరని తెలిపింది. 
 
Top