తెలుగు ఇండస్ట్రీలో మకుటం లేని మహరాజుగా వెలిగిపోయిన మహానటులు నట సార్వభౌములు నందమూరి తారక రామారావు.  తెలుగు ఇండస్ట్రీని తమిళ, మళియాల, హిందీ ఇండస్ట్రీలో కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చేలా తన అద్భుతమైన నటనతో అందరి హృదయాలు గెలిచారు. ఓ వైపు నటులుగా కొనసాగుతూనే తెలుగు వారు ఆత్మగౌరవం దశదిశలా చాటి చెప్పేందుకు తెలుగు దేశం పార్టీ స్థాపించారు.  ప్రతి పల్లెలో తెలుగు దేశం పార్టీ జెండా పాతి రాజకీయాలు అంటే ఏమిటో ప్రతి ఒక్కరికీ తెలిసేలా చేశారు.  
ఈయన నటవారుసడిగా నందమూరి బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చారు..తండ్రితోపాటు కొన్ని సినిమాల్లో నటించిన బాలయ్య   సాంఘిక,పౌరాణిక,జానపద చిత్రాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.   గత కొంత కాలంగా ఫ్యాక్షన్ తరహా చిత్రాల్లో నటిస్తూ పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ తో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ సంపాదించారు.  ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హిస్టారికల్ చిత్రం ‘గౌతమి పుత్రం శాతకర్ణి’ చిత్రంలో నటిస్తున్నారు.  ఈ చిత్రం బాలయ్యకు 100 వ చిత్రం కావడం కూడా మరో విశేషం.  బాలకృష్ణ కేవలం నటుడిగానే కాకుండా హిందూపురం ఎమ్మెల్యేగా కూడా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం  త‌న‌యుడిని క‌థానాయ‌కుడుగా లాంచ్ చేయ‌డ‌మే నంద‌మూరి బాల‌కృష్ణ‌కుఉన్నమ‌రో అతి పెద్ద బాధ్య‌త‌.  ఇప్పటికే వంద చిత్రాల్లో నటించిన బాలకృష్ణ తనయుడు హీరో అంటే ఎన్నో అంచనాలు ఉంటాయి కనుక మొదటి సినిమా భారీ బ్లాక్ బ్లస్టర్ కావాలని చూస్తున్నారు.  అందుకోసం ముగ్గురు ద‌ర్శ‌కుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నార‌ట‌. త్రివిక్ర‌మ్‌, పూరీ, క్రిష్ వీళ్లు ముగ్గురిలో ఎవ‌రో ఒక‌రితో మోక్ష‌జ్ఞ తొలి సినిమా ప‌ట్టాలెక్కుతుంద‌ట. అయితే ఈ ముగ్గురు డైరెక్టర్లు కూడా ఎవరి స్టైల్ వారికి ఉన్నవారు కావడం విశేషం.  మ‌రి బాల‌య్య ఎవ‌రి చేతిలో త‌న‌యుడిని పెడ‌తాడో వేచి చూడాల్సిందే..!
 
Top