ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జొహార్ కు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మ ఝలక్కిచ్చింది. బాలీవుడ్ స్టార్స్ తో 'కాఫీ విత్ కరణ్' పేరిట ఓ టాక్ షోను కరణ్ జొహార్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరించే ఈ షోలో గాసిప్పులకు కొదవలేదు. గెస్టులను గుచ్చిగుచ్చి అడిగి.. కూపీలాగి మరీ.. వారి సీక్రెట్లు బయటపెట్టే కరణ్.. తాజాగా ఈ షోలో తానే బలయ్యాడు.
తాజాగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సరదాగా మాట్లాడుతూ, అనుష్కతో ప్రేమలో పడిపోయానని అన్నాడు. కేవలం అనుష్క కోసమే 'యే దిల్ హై ముష్కిల్' సినిమా చేశానని అన్నాడు.దీనికి వెంటనే రిటార్ట్ ఇచ్చిన అనుష్క... 'అవును, అందుకే షూటింగ్ సమయంలో నన్ను అసభ్యంగా తాకావు' అంటూ ఆరోపించింది. దీనికి కత్రిన స్పందిస్తూ 'నీలో కొంత చురుకుదనం తేవడానికి అలా చేసి ఉంటాడు' అని పేర్కొనగా.. అనుష్క మాత్రం వెనుకకు తగ్గలేదు.
'జాక్వలిన్ కూడా నీపై ఫిర్యాదు చేసింది. మనీష్ మల్హోత్రా పార్టీలో నువ్వు ఆమెను అసభ్యంగా తాకావంట' అని పేర్కొంది. దీంతో కత్రిన జోక్యం చేసుకొని ఈ 'లీగల్' తగాదాను ఇక్కడితో ముగించాలని వేడుకొంది. ఇదంతా వీరు సరదా కోసమే చేశారా? లేక నిజంగా ఏదైనా జరిగిందా? అన్నది దేవుడికే తెలియాలి అంటున్నారు బాలీవుడ్ జనాలు.