నిన్న సాయంత్రం అత్యంత వైభవంగా జరిగిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆడియో ఫంక్షన్ లో ఉద్వేగభరితంగా మాట్లాడిన బాలకృష్ణ మాటలలో నయనతారను మరిచిపోలేకపోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.  ‘శాతకర్ణి’ సినిమాలో గౌతమీ పాత్రను పోషించిన హేమమాలిని గురించి మాట్లాడుతూ ‘నయనతార లేకుంటే శ్రీరమరాజ్యం లేదు. హేమమాలిని లేకపోతే శాతకర్ణి సినిమా లేదు’ అంటూ బాలకృష్ణ కామెంట్ చేయడం చాలామందికి షాక్ ఇవ్వడమే కాకుండా బాలయ్య ఇప్పటికీ నయనతారను మరిచిపోలేక పోతున్నాడు అని కామెంట్స్ చేసుకునేలా బాలయ్య మాటలు అర్ధాన్ని ఇచ్చాయి.

ఇదే సందర్భంలో ‘శాతకర్ణి’ చరిత్రకు సంబంధించిన ఒక ఆశ్చర్యకర విషయాన్ని ఈ ఆడియో ఫంక్షన్ లో బయటపెట్టారు.  ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లండన్ మ్యూజియంలో రెండు గ్యాలరీలు ఉంటే ‘ఒకటి గ్రీస్ గ్యాలరీ అయితే మరొకటి అమరావతి గ్యాలరీ’ అని అమరావతికి సంబంధించిన చరిత్ర జ్ఞాపకాలు లండన్ మ్యూజియంలో ఇప్పటికీ బద్రపరిచి ఉన్నాయి అన్న మాటలు చంద్రబాబు నోటివెంట విన్నవారు షాక్ అయ్యారు. 

చరిత్రలో ఎందరో రాజులు మన భారతదేశాన్ని పరిపాలించినా వారి చరిత్రను లండన్ మ్యూజియంలో నిక్షిప్తం చేయలేదని అటువంటి ఘనత ఒక ‘శాతకర్ణి’ కే సొంతం అన్న మాటలు ముఖ్యఅతిథి చంద్రబాబు నోటివెంట వచ్చాయి. ఈమాటలు విన్నవెంటనే ఆకార్యక్రమానికి వచ్చిన అతిధులతో పాటు అశేష ప్రజానీకం కూడ తెలుగు జాతి చరిత్రకు సంకేతంగా ‘శాతకర్ణి’ సినిమా మారబోతోంది అన్న ఊహలలోకి వెళ్ళిపోయారు.

ఇదే సందర్భంలో దర్శకుడు క్రిష్ మాట్లాడిన మాటలను బట్టి శాతకర్ణి సినిమాలో చరిత్రతో కొంత ఊహాజనితమైన కథ కూడ ఉంది అన్న విషయాన్ని లీకులు ఇచ్చాడు. చరిత్ర ద్వారా ‘శాతకర్ణి’ గురించి తెలిసింది చాల తక్కువ అని అంటూ కేవలం కాశిలో వేయించిన శాసనాల ద్వారా ఈసినిమాకు సంబంధించిన కథను అల్లిన విషయాన్ని లీకులు ఇచ్చాడు క్రిష్.

నిన్న విడుదలైన పాటలు చాల డిఫరెంట్ గా ఉన్నాయి అన్న కామెంట్స్ రావడంతో చిరంతన్ భట్ ఇచ్చిన మ్యూజిక్ కు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.  ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ పాటల పరీక్షలో కూడ మంచి మార్కులే సంపాదించుకుంది కాబట్టి ఈమూవీ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అని అంటున్నారు నందమూరి అభిమానులు..  
 
Top