తెలుగు జాతి, తేజం, చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, కళలు...ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ గొప్పగొప్ప అంశాలే. తెలుగు వారిలో ఘనత వహించిన క్షత్రియపుత్రుడు జంబూద్వీపములో శాలివాహన శకావిష్కరణకు తెరలేపిన ఘనుడు గౌతమీపుత్ర శాతకర్ణి అనటములో సందెహం లేదు.  ఆ విజయాలు ఆకాలానికి అనితర సాధ్యాలే. ఆయన సినిమా ఆడియో విడుదల ఉత్సవములో చెప్పినట్లు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆయన ఈ దేశాన్ని పరిపాలించలేదు. అసలు దక్షిణ భారతము లొ కన్యాకుమారి ప్రాంతం, భారత మకుటం అనదగ్గ కాశ్మీరుకు ఆయన వెళ్ళిన దాఖలాలు లేవు. వీళ్ళ మాటల్లో చరిత్ర హననం, వక్రీకరణం జరిగింది.

శకపురుషుడు గౌతమీపుత్రుడు యుద్దపిపాసి, రాజ్యవ్యాప్తి తప్ప మరో ఆలోచన ఇసుమంతైనా లేని రక్త పిపాసి. ఆయన జీవితములో తల్లి ప్రేమ తప్ప మరే ఇతర ప్రేమలకు ఆస్కారం లేనేలేదని ఏనాడో చరిత్రకారులు చెప్పారు. నియంతృత్వం, రాజ్యవ్యాప్తి ఆయన హృదయ స్పందనలోని సంకోచ వ్యాకోశాలు అవే ఆయన శ్వాసలోని ఉచ్వాస నిశ్చ్వాసాలు. ఓకే. దృశ్యాల ధారా ప్రవాహం సాంకేతిక నిపుణుల చాతుర్యంతో మనం ఈ సినిమా వినోదాన్ని అభినందించవచ్చు, ఆస్వాదించవచ్చునేమో కాని కధాపరంగా వాణిజ్య విలువలు, చిలవలు పలవలు గా నింపబడ్డట్టు తెలుస్తుంది. ఆసాంతం చరిత్ర వక్రీకరణ రుద్రమదేవి సినిమాలో లాగే జరిగింది. రుద్రమదేవి సినిమాలో డబ్బు కోసం క్షాత్రపుత్రి, పాలనాధాత్రి "రుద్రమదేవి"  పాత్రను చంపేశారు.
ఇక్కడ శాతవాహనునకు లేని సుగుణాలు అంటగట్టి పాత్రను పైకి లేపినట్లు తెలుస్తుంది. సినిమాను 80 రోజుల్లో తీసినట్లు చెప్పారు కాబట్టి ఆస్థాయిలో దృశ్యమాలికలు అంత తక్కువ సమయములో తీయటమనేది ఒక నమ్మలేని నిజమా? ఏవో అంతర్జాతీయ సినిమాలోని లేదా భారతీయ సినిమాలోని అనుకూల దర్శకనిర్మాతలతో లాలూచి పడి వారి స్నెహమో? కక్కుర్తినో? వాటినే వాడుకొని లాగించి ఉండొచ్చు. కాని అది క్రిష్ నైజం కాదు. వేదం, కంచే చూసి ఆయన అభిమానిగా మారిన నేను అలా భావించలేకపోతున్నా. నా అలోచన నిజం కాకూడదని ఆ దైవాన్ని కోరుకుంటున్నా! 
గౌతమీపుత్ర శాతకర్ణి, పాత్రధారి నందమూరి బాలకృష్ణ ఉపన్యాసం తామర తంపరగా, అతుకుల బొంతలా, విసుగు చిరాకు, వినేవారికే న్యూనతాభావం అణువణువునా పొంగిపొరల్చింది. అసందర్బ సాంఘిక సంక్షేమ పథకాలతో ఊదరగొట్టే అరిగి పోయిన గ్రాంఫోన్ రికార్డ్ లాంటి చంద్రబాబు ఉపన్యాసం "ఝాండూబాం" కోసం వెతుక్కునేలా చేసింది. తనను తాను శాతవాహనునితో పోల్చుకోవాలని ప్రయత్నించినట్లు కనిపించింది.  ఇంతలో సాక్షి  ఏకి పీకి పెడుతుందని భయపడినట్లు అనిపించి ఆ పోలిక జోలికి పోలేదు. అంతవరకు అదృష్టవంతులం. 
"పేరులోనే తల్లిని చేర్చుకున్న ఆ ప్రేమను  వీళ్ళు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది"  స్త్రీలపై ఈ బావా బావమర్దులకున్న గౌరవం మన తెలుగు వారందరికీ తెలుసు. చంద్రబాబు పాలనలో వనజాక్షి గారికి, జానిమూన్ గారికి జరిగిన పరాభవం జనం మరచిపోరు. అలాగే బాలకృష్ణ ఆడవాళ్లకు కడుపుచేయటం గురించి అనంతపూర్లో నారా రోహిత్ సినిమా సందర్భంగా వేదికపై ప్రేలిన ప్రేలాపనలు ప్రజలకు తెలుసు. ఆ విషయాలు తెలిసి అర్ధమైతే గౌతమి పాత్ర పోషించిన హేమమాలిని సిగ్గుపడివుండేది. ఎన్.టి.ఆర్ కడిపున పుట్టిన ఈ పిందె ఇలాస్ ప్రవర్తిస్తాడా? అనుకునేది.  చివరికి వీరంతా గౌతమీపుత్రుని క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నంలో ఉన్నారనిపిస్తుంది. మిష్టర్ క్రిష్!  వేదికలపై మాట్లాడేటప్పుడు బాలకృష్ణను కాస్త ప్రిపేరవ్వమని చెప్పండి. లేకుంటే రసాబాస తప్పదు.  

లెజెండ్ సినిమాని 1000 రోజులు అర్చన లాంటి చిన్న థియేటఋ లో నడిపించిన చరిత్ర ఇక్కడి ప్రజలకు తెలుసు. అదేమన్నా దాన వీర శూర కర్ణ అంత గొప్ప సినిమానా? జనం నోటితో కాదు ఇంకో రంద్రం తో నవ్వుతారన్న జ్ఞానం లేకపోవటం ప్రజల దురదృష్టం.

"నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా సరికొత్త రికార్డు నమోదు చేసింది. దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలో నాలుగు అంకెల రోజులు ప్రదర్శితమైన సినిమాగా చరిత్ర సృష్టించింది. సోమవారం నాటికి ఈ సినిమా 1005 రోజులు పూర్తి చేసుకుందని ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వరరావు తెలిపారు. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులోని అర్చన ధియేటర్‌ లో నిర్విరామంగా వెయ్యి రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుందని వెల్లడించారు. సౌత్‌ ఇండస్ట్రీలో ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా 'లెజండ్‌' నిలిచిందన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ ను విడుదల చేశారు. తమ అభిమాన నటుడి సినిమా సక్సెస్ ఫుల్ గా వెయ్యి రోజులు పూర్తి చేసుకోవడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కేక్ కట్ చేసి, బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
 
Top