తెలుగు ఇండస్ట్రీలో మెగా  ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవన్ కళ్యాన్.  మొదట్లో పెద్దగా పేరు రాకపోయినా..తర్వాత ఖుషి, జల్సా,గబ్బర్ సింగ్ లాంటి సినిమాలతో ఏకంగా నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లిపోయారు.  అంతే కాదు అప్పట్లో మెగాస్టార్ కి వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాన్ సంపాదించాడు. ప్రస్తుతం ఓ వైపు రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూనే సినిమాలు తీస్తున్నారు.  ఇక రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ‘ఈశ్వర్ ’ లాంటి మాస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్.  తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోయినా..రాజమౌళి దర్శకత్వలో వచ్చిన ‘చత్రపతి’ చిత్రంతో ఒక్కసారే స్టార్ డమ్ తెచ్చుకున్నాడు.  
ఇక బాహుబలి చిత్రంతో జాతీయ నటుడిగా పేరు సంపాదించాడు.  తాజగా ఈ ఇద్దరు నటులకు షాక్ ఇచ్చారు ఫోర్బ్స్ మ్యాగజైన్ సంస్థ . భారతదేశ వ్యాప్తంగా అత్యధిక పేరు ప్రతిష్టలు , ఆదాయం , గూగుల్ ర్యాంకింగ్ లను ప్రామాణికంగా తీసుకుంటారు.  ఇక జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన పవన్ కళ్యాన్ కి చోటు దక్కలేదు.  భారతదేశ వ్యాప్తంగా అత్యధిక పేరు ప్రతిష్టలు , ఆదాయం , గూగుల్ ర్యాంకింగ్ లను ప్రామాణికంగా   పేరు ఖచ్చితంగా రావలసిందే కానీ పవన్ కళ్యాణ్ ని వంద మంది జాబితాలో చేర్చలేదు దాంతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు .

మరోవైపు బాహుబలి చిత్రంతో ప్రపంచ స్థాయిలో తెలుగోడి సత్తా ఏమిటో నిరూపించిన చిత్రం ‘బాహుబలి’ ఈ చిత్రంలో నటించిన ప్రభాస్ కి కూడా ఎంతో గొప్ప పేరు వచ్చింది. అంతే కాదు  సౌత్ లోనే ఎవరికీ సాధ్యం కానీ మైనపు విగ్రహం ప్రభాస్ కు పెడుతున్నారు.  జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఫోర్బ్స్ మ్యాగజైన్ షాక్ ఇవ్వడంపై ఫ్యాన్స్  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .
 
Top