తెలుగు ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘ఏక్ నిరంజన్’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది హాట్ బ్యూటీ కంగనా రనౌత్. ఆ తర్వాత తెలుగులో మరే సినిమాలోనూ నటించని ఈ అమ్మడు బాలీవుడ్ లో మాత్రం చాలా సినిమాల్లో నటించింది. అందం చూపించడంలో ఈ అమ్మడు ఏ మాత్రం సిగ్గూ పడకుండా విపరీతమైన ఎక్స్ పోజింగ్ తో కుర్రకారు మతులు పోగొడుతుంది. అంతే కాదు సినిమా ఇండస్ట్రీ, దర్శక,నిర్మాతలై ఇప్పటికే పలు సంచలన వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది.
తాజాగా ఈ అమ్మడు హీరోలపై సంచలన కామెంట్స్ చేసి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. హీరోలు కొత్తగా వచ్చిన హీరోయిన్ లను వాడుకుంటారని నన్ను కూడా వచ్చిన కొత్తలో వాడుకున్నారని సంచలన ఆరోపణలు చేసింది బాలీవుడ్ భామ కంగనా రనౌత్ . నా మాట అబద్దం అయితే ఏ హీరో నైనా బహిరంగంగా ఖండించమని సవాల్ విసురుతోంది . అప్పట్లోనే కాదు ఇప్పుడు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళని , వస్తున్న వాళ్ళని హీరోలు , దర్శక నిర్మాతలు వాడుకుంటున్నారని మరోసారి స్పష్టం చేసింది .
కంగనా ఇంత పెద్ద బాంబ్ పేల్చడం తో యావత్ చిత్ర పరిశ్రమ మరోసారి షాక్ గురైంది. ఆ మద్య హృతిక్ రోషన్ తో ఘాటుగా ప్రేమాయణం నడిపించి అది కాస్త బెడిసి కొట్టడంతో నానా హంగామా చేసింది. అంతే కాదు ఈ అమ్మడు రెమ్యూనరేషన్ 15 కోట్లు ఇస్తే కాని నటించనని చెప్పడంతో దర్శక, నిర్మాతలు హడలిపోతున్నారు.