ఈరోజు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆడియో ఫంక్షన్ జరగబోతున్న సందర్భంగా ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ తాను ‘శాతకర్ణి’ పాత్రను నటించి మెప్పించడానికి ఎంత కష్టపడింది సవివరంగా వివరించాడు.  ఈసినిమా షూటింగ్ జరుగుతున్నంతసేపు తాను బరువు పెరుగుతానని వరి అన్నం తినడం మానివేసిన విషయాన్ని బయట పెట్టాడు బాలయ్య. 

అంతేకాదు ఈసినిమాకు సంబంధించి తాను వేసుకున్న కాస్ట్యూమ్స్ విషయంలో చాల జాగ్రత్తలు తీసుకున్న విషయాలను విఅవరిస్తూ అప్పట్లో రాజులు ఎలా ఉండేవారు అన్న విషయమై ఎటువంటి చారిత్రక ఆధారాలు లేకపోవడంతో దొరికిన కొన్ని శాసనాలను ఆధారంగా చేసుకుని తన కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన విషయాన్ని తెలియ చేసాడు బాలకృష్ణ.  అయితే ఈసినిమా షూటింగ్ సమయంలో అత్యంత బరువైన ఆ కాస్ట్యూమ్స్ తో కుర్చీలో కూర్చుంటే చాల అసౌకర్యంగా ఉండేది అని అందువల్ల తను కేవలం ఒక స్టూల్ పై మాత్రమే కూర్చున్న విషయాన్ని లీక్ చేసాడు బాలయ్య. 

ఈసినిమా షూటింగ్ లో యుద్ధ సన్నివేశాలు తీస్తున్నప్పుడు తాను గుర్రపుస్వారీ చేస్తూ ఒకసారి మొరాకాలో మరొకసారి జార్జియా ఇలా రెండు సార్లు గుర్రం పై నుంచి పడిన సంఘటనను గుర్తుకు చేసుకుంటూ తాను ఈసినిమా షూటింగ్ లో చాల పెద్ద గండాలను దాటినా విషయాన్ని బయట పెట్టాడు. ఈసినిమాను 80 రోజులలో పూర్తి చేయడం కోసం తాను ఒకోక్కరోజు రోజుకు 16 గంటలు కూడ షూటింగ్ స్పాట్ లో ఉన్న విషయాన్ని గుర్తుకు చేస్తూ ఇది అంతా దైవ కృప అని అభిప్రాయ పడుతున్నాడు ఈ నందమూరి సింహం.

ఇది ఇలా ఉండగా మరొక విషయాన్ని బయట పెట్టాడు బాలయ్య.  తన 100వ చిత్రంగా కృష్ణవంశీ సినిమా కథకు సంబంధించి అనేక చర్చలు చేసి కృష్ణవంశీకి ఆసినిమాకు సంబంధించి అడ్వాన్స్ ఇచ్చి ఇక ఆసినిమా షూటింగ్ ప్రారంభమే తరువాయి అనుకుంటున్న నేపధ్యంలో క్రిష్ తనను కలిసి ‘శాతకర్ణి’ కథను చెప్పిన తరువాత తన ఆలోచనలు మారిపోయిన విషయాన్ని వివరంగా తెలియచేసాడు. అంతేకాదు కేవలం 14 గంటల వ్యవధిలో తాను కృష్ణవంశీ సినిమా నుండి ‘శాతకర్ణి’ సినిమా వైపు వచ్చే కీలక నిర్ణయం తీసుకున్న విషయాలను తెలియచేసాడు.

శక కర్తగా తెలుగువాడి పౌరుషాన్ని చాటిన చక్రవర్తిగా కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన ఈ కథను తిరిగి తెలుగు వారికి పరిచయం చేయడం తన అదృష్టమే కాకుండా ఈ నిర్ణయం వెనుక ఎదో అద్భుతమైన ‘దైవ కృప’ ఉంది అని అంటున్నాడు బాలయ్య..
 
Top