ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యు లో హీరోయిన్లను హీరోలు వాడుకుంటారు..?అన్న మాట మీద మీరూ నిలబడతారా..? అన్న ప్రశ్నకు బాలీవుడ్ భామ కంగనా రనౌత్ సమాధానం చెబుతూ ఇప్పుడే కాదు. ఎప్పుడూ నిలబడతాను. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నన్నూ వాడుకున్నారు. అసలు స్టార్‌ హీరోయిన్లు అందరూ ఈ పరిస్థితిని ఎదుర్కొన్నవారే. ఎవరో కొందరు కుటుంబ నేపథ్యం ఉన్నవారు తప్పించి చాలామందికి నాకు ఎదురైన, జరిగిన అనుభవాలే జరిగాయి. ఇవన్నీ జగమెరిగిన సత్యాలే! నేను ఆ విషయాలే చెబితే కొందరు భుజాలు తడుముకుంటున్నారు. నేను అన్న మాటలు తప్పు అని ఎవరూ ఇంతవరకూ పబ్లిక్‌గా స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదు. అంటే నేను అన్నమాటలు నిజమేగా అని అన్నారు.
మీ నోటికి అందరూ భయపడతారు..? అన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ..నిజాలు మాట్లాడితే అలానే భయపడతారు. నేను ఏం చెప్పినా ప్రాక్టికల్‌గా చూసినవి, అనుభవపూర్వకంగా తెలుసుకున్నవి మాత్రమే మాట్లాడతాను. అబద్ధాలు చెప్పను. అందుకే నేను చెప్పిన మాటలను ఎవరూ ఖండించరు. వారికీ తెలుసు. అవన్నీ నిజాలే అని. నిజాలు మాట్లాడతాను కనుక నన్ను చూసి భయపడతారు. అలా భయపడని వాళ్ళే నాతో స్నేహం చేస్తారు. స్త్రీలకు స్వేచ్ఛ ఉందని అంటారే కానీ వారికి మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదు. నాలాగా కొందరు ధైర్యం చేసి మాట్లాడితే పై విధంగా విమర్శిస్తారు. 
గుర్రపు స్వారీ వచ్చేసినట్టేనా..? ‘రాణి లక్ష్మీబాయి’ సినిమా కోసం నేర్చుకున్నా. ఇందుకోసం ప్రత్యేకంగా జర్మనీలో శిక్షణ పొందాను. సినిమాల్లో గుర్రపు స్వారీ దృశ్యాలలో ట్రైన్డ్‌ గుర్రాలనే వాడతారు. చాలా వరకూ డూప్‌లతోనే చేసేస్తారు. కానీ ఈ సినిమాలో డూప్‌ వద్దన్నాను. నేనే స్వారీ చేస్తానని చెప్పాను. ఎంత ట్రైన్డ్‌ గుర్రాన్ని ఉపయోగించినా, వాటి గురించి తెలుసుకోకపోతే కష్టం. అందుకే వివిధ జాతుల గుర్రాల గురించీ, వాటి అలవాట్లు, ఎప్పుడు ఎలా స్పందిస్తాయి అన్న విషయాల మీద శిక్షణ పొందాను. గుర్రంపై నుంచి పడిపోయినప్పుడు చేయవలసిన ప్రథమ చికిత్స గురించి కూడా తెలుసుకున్నాను. ఈ సినిమా కోసం కొద్దిగా బరువు కూడా పెరిగాను. వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుంది. ఈ సినిమాను చాలా ప్రత్యేకంగా తీసుకున్నాను. అందుకే ఇన్ని జాగ్రత్తలు. ‘క్వీన్‌’ నాకు ఎంత పేరు తెచ్చిందో అంతకు మించిన పేరు తెస్తుంది ఈ సినిమా. 
 
Top