ఇప్పుడు ఎవరి నోట విన్న కంచె సినిమా గురించే మాట్లాడుతున్నారు. ఒక
మంచి సినిమా ప్రేక్షకులకు అందించాలని తపనతో కేవలం కథని నమ్ముకుని సినిమాలు
తీస్తున్న గొప్ప దర్శకుడి నుండి వచ్చిన అద్భుత చిత్ర కంచె. సినిమాలో ఎక్కడ
కథను డీవియేట్ చేసే పాయింట్ పెట్టలేదు. కేవలం ఒక సినిమా అనుభవమున్న హీరోతో
క్రిష్ చాలా పెద్ద ప్రయోగం చేశాడు. వరుణ్ తేజ్ కూడా సినిమాకు ఊపిరి పోశాడు.
ఇక అన్ని అంశాలు అద్భుతంగా కుదిరిన ఈ సినిమాలో హైలెట్ గా
చెప్పుకోవాల్సినవి వస్తే డైలాగులని చెప్పొచ్చు.
అవును
కంచె సినిమాలో మాటల తూటాలతో ఆడియెన్స్ ని అబ్బురపరచేలా చేశాడు సాయి మాధవ్
బుర్రా.. ఆడతనం ఒక్కోచోట ఒక్కోవిధంగా ఉంటుందని తెలుసు కాని అమ్మతనం
ఎక్క్డడైనా ఒకేలా ఉంటుందని నిరూపించావమ్మ.. అంటూ చెప్పే డైలాగులు..
ఇన్నాళ్లు సైన్యంలో ఒకడిగా ఉన్నావ్ ఇప్పుడు నిజమైన సైనికుడయ్యావ్ అంటూ.. తన
మాటల యుద్ధాన్ని ప్రేక్షకుల మీదకు వదిలాడు దర్శకుడు క్రిష్. సాయి మాధవ తో
తను రాయించుకున్న మాటలే సినిమాకు ప్రాణం పోశాయి.
ఒక
విధంగా చెప్పాలంటే కంచె మాటల అస్త్రం బాగా పనిచేసింది. రెండవ ప్రపంచ
యుద్ధానికి ఒక ప్రేమకథని జోడించి కేవలం కథని మాత్రమే హైలెట్ చేస్తూ తీసిన
సినిమా కంచె. ధూపాటి హరిబాబు క్య్రారక్టర్లో వరుణ్ తేజ్ పరకాయ ప్రవేశం
చేశాడని చెప్పొచ్చు. ఎక్కడా సినిమా నుండి బయటకు వచ్చే విధంగా చేయలేదు.
కెమెరామెన్ గుణశేఖర్ పనితనం కూడా సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. హీరోయిన్ ప్రగ్య జైశ్వాల్ కూడా తన పాత్ర పరిధి మేరకు మంచి నటనతో ఆడియెన్స్ ని అలరించింది. మొత్తంగా మూస థోరణిలో పోతున్న మన తెలుగు సినిమాను కొత్త ఒరవడిని సృష్టించి తెలుగు సినిమాల స్టామినాను మరోసారి బయట ప్రపంచానికి తెలిసేలా చేశాడు క్రిష్. అందుకే అతనికి హ్యాట్ సాఫ్ చెబుతూ ఆ దర్శకుడి నుండి ఇలాంటి గొప్ప సినిమాలు ఎన్నో రావాలని ఆశిద్దాం.