ఈమధ్య పంచ్ డైలాగులకు ప్రేక్షకులు విసిగి పోవడంతో టాప్ హీరోల
సినిమాలలో ఈపంచ్ డైలాగుల హడావిడి బాగా తగ్గింది. అయితే నిన్న ‘బెంగాల్
టైగర్’ ఆడియో వేడుకలో విడుదల చేయపడ్డ ట్రైలర్ లో ఈపంచ్ ల సీజన్ మళ్ళీ
వచ్చిందా అని అనిపించేడట్లుగా ఆ ట్రైలర్ అంతా పంచ్ లతో హోరెత్తి పోవడం
అందరినీ ఆశ్చర్య పరచడమే కాకుండా రవితేజాకు పంచ్ లపై మోజు తగ్గలేదా అని
అనిపించేదట్లుగా చేసింది.
ఇది చాలదు
అన్నట్లుగా రవితేజ ఈసినిమా ట్రైలర్ లో వారసత్వ హీరోలను టార్గెట్ చేయడం
మరింత షాకింగ్ గా మారింది ‘ నేను సపోర్ట్ తో పైకి వచ్చిన వాణ్నికాదు సోలోగా
పైకొచ్చిన వాణ్ని’ అంటూ రవితేజా ఈసినిమాలో వేసిన సెటైర్ వారసత్వ హీరోలకు
షాక్ ఇస్తుంది అనడంలో ఎటువంటి సందీహంలేదు.
సామాన్యంగా
వివాదాలకు దూరంగా ఉండే మాస్ మహారాజా ఇలా వరసత్వ హీరోలను టార్గెట్ చేయడం
వెనుక ఏమైనా ఎత్తుగడ ఉందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే
ఏబ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన మాస్ రాజా కేవలం తన గొప్ప
చెప్పుకోవడానికీ ఈపంచ్ వేసాడు అనే కామెంట్స్ కూడా ఉన్నాయి. ఈ డైలాగ్ తో
పాటు ‘‘నన్ను చంపే కత్తి కానీ, గన్ను కానీ తయారవలేదు, మేక్ యాన్ ఆర్డర్’’
అంటూ ఇంకో పవర్ ఫుల్ డైలాగ్ చెప్పి తన అభిమానులకు జోష్ ఇవ్వడానికి
ప్రయత్నించాడు.
ఇది చాలదు అన్నట్లు
గా హీరోయిన్ తమన్నా రవితేజ గురించి చెపుతూ ‘వాడు టైగర్ బెంగాల్ టైగర్
అది జాతీయ జంతువు వీడు జాతి జంతువు’ అంటూ చెప్పిన పంచ్ లను చూస్తూ ఉంటే
ఈసినిమా కూడకథ లేకుండా కేవలం పంచ్ లపైనా, తమన్నా గ్లామర్ ఎక్స్ పోజింగ్
పైన ఆధారపడిన మామూలు రొటీన్ సినిమాయేనా అని అనిపించడం సహజం. ఈ ట్రైలర్ లో
కూడ రవితేజ లుక్స్ లో ఇదువరకటి ఆకర్షణ కనిపించడంలేదు అనే కామెంట్స్
ఉన్నాయి. ఏమైనా రాబోతున్న ఈసినిమా రవితేజ కెరియర్ కు చాలా ముఖ్యంగా మారింది
అనడంలో ఎటువంటి సందేహంలేదు..