నటీమణులు ప్రచారంకోసం ఎంతదూరమైనా వెళతారు సిగ్గు, శరంతో పాటు ఏమైనా విడిచేస్తారు. వాళ్ళకు కావలసింది సందర్భం మాత్రమే. ఇప్పుడీ నటీమనికి దొరికిన సందర్బం క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆ అందాల నటీమణి మనకివ్వగల శుబాకంక్షలు ఏముంటాయ్ ఆమెదగ్గర. సముద్రమంత లోతైన ఆమె హృదయ విషాలం. అసలు కథేమిటో చదవండి. 
దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న ఈ నటిని గుర్తు పట్టారా? అదే టాలీవుడ్ టాప్ హీరోయిన్, అక్కినేని నాగ చైతన్యకు కాబోయే భార్య సమంత సోషల్ మీడియాలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసింది. అయితే ఆమె ఆ విషెస్‌ను కొంత వింత పద్దతిలో చెప్పింది. క్రిస్మస్చెట్టు పక్కన ఉండటం, సెలబ్రేషన్‌లో ఉన్న ఫొటోల వంటివి కాకుండా బీచ్‌లో స్నానం చేస్తు న్నట్టు ఉన్న ఫొటోలను పోస్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. తనకు ఉండాలనుకుంటున్న లక్షణాలు అన్ని సముద్రానికున్నా యని చెబుతోంది ఈ సుందరి.
అవేమంటే అందం, అంతు చిక్కని రహస్యాలు, సువిశాలమైన తత్వం, స్వేచ్ఛ అంటోంది ఈ ముద్దు గుమ్మ, అందరికీ ప్రేమ, శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు కూడా తెలిపింది. సముద్రం లో వెనకవైపు నుంచి దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేసి తన
అభిమానులకు క్రిస్‌మస్ శుభాకాంక్షలు తెలిపింది.
2017 జనవరి 29న నాగచైతన్య, సమంతల నిశ్చితార్థం ఘనంగా నిర్వహించేందుకు అక్కినేని కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది. నిశ్చితార్థం తరువాత కాస్త గ్యాప్ తీసుకొని అఖిల్ పెళ్లి తరహాలోనే నాగచైతన్య, సమంతల వివాహాన్ని "డెస్టినేషన్ వెడ్డింగ్ " లా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమాలో పనుల్లో బిజీగా ఉండగా, సమంత మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ, ఇలా ఇంకా అభిమానులని శృంగార తరంగాలు మీటుతూ ఎంటర్టెయిన్మెంట్ చేస్తుంది. 
అయితే ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు సమంతకు కూడా శుబాకాంక్షలు తెలిపారు. అయితే కొందరు సమంతను తాము ఇలా చూడాలనుకోవడంలేదని, ఇలా కనిపించ వద్దని కోరారు. మరి కొందరు  ఇదో అద్భుతమైన "ఫొటోస్టిల్" అని, సముద్రం కూడా చాలా బాగుందంటూ, సముద్రంలో సమంత "బాక్"  చాలా బాగుందని కామెంట్ చేశారు.

 
Top