ఉపాసన రామ్ చరణ్ లు నేటి టాలీవుడ్ యంగ్ కపుల్స్ లో మెడ్ ఫర్ ఈచ్ అదర్ గా ఉంటారు. అన్న విషయం తెలిసిందే.  అయితే ఎంతో సన్నిహితంగా ఉండే చరణ్ ఉపాసనల మధ్య ఈమధ్య జరిగిన తమన్నా పుట్టినరోజునాడు జరిగిన పార్టీ వల్ల చిన్న కోపాన్ని కలిగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈవిషయాన్ని స్వయంగా రకుల్ ప్రీత్ తన ట్విటర్ లో బయట పెట్టింది.

ఆసక్తిరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే తమన్నా తన పుట్టినరోజును చరణ్ అఖిల్ రకుల్ ప్రీత్ లతో కలిపి జరుపుకుంది.  ఇంకా తాను పుట్టినరోజు ఫీలింగ్ లోనే ఉన్నానని అంటూ తమన్నా తన పుట్టినరోజునాడు చెర్రీతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫోటోను తన ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసింది. 

ఈపార్టీకి చరణ్ భార్య ఉపాసన కూడ వచ్చింది.  అయితే ఈ పార్టీలో రకుల్, తమన్నా కలిసి గ్రీన్ టీ త్రాగారట. అంతేకాదు ఆ పార్టీలో చరణ్ హీరోయిన్స్ తో జోక్స్ కట్ చేస్తూ తెగ హడావిడి చేసారట. అయితే ఆ పార్టీలో రకుల్, తమన్నా కలిసి ఇలా గ్రీన్ టీత్రాగటం ఉపాసనకు నచ్చలేదట.

ఈ విషయాన్ని స్వయంగా రకుల్  తన ట్విట్టర్ అకౌంట్లో పెట్టింది. అయితే  తమన్నా రకుల్ గ్రీన్ టీ తాగితే ఉపాసనకు ఎందుకు నచ్చలేదో ? అన్న విషయం పక్కకు పెడితే ఇప్పుడు ఈ విషయాన్ని రకుల్ ట్విట్ చేసి మరీ అందరికీ తెలిసేలా ఎందుకు చేసిందో తెలియదు.  ఏది ఏమైనా ఇప్పుడు రకుల్ పెట్టిన ట్విట్ వెనుక అర్ధాలు ఏమిటి అని వెతికే పనిలో కొందరు తమ పరిశోధనలు సాగిస్తున్నారు..   
 
Top