మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైది నెంబర్ 150 మూవీకు సంబందించిన అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు సాంగ్ ఓ వారం క్రితం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చిరులోని మాస్ కోణం ఎలా ఉంటుందో చూపించబోయే ఈ సాంగ్ మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అందుకే సాంగ్ రిలీజ్ అయిన అతి తక్కువ టైంలో యూట్యూబ్ రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పటికి 5 మిలియన్ వ్యూస్ తో చిరు స్టామినా చూపించిన ఆ సాంగ్ అసలు దేవి జనతా గ్యారేజ్ కోసం కంపోజ్ చేశాడట.

కొరటాల శివ డైరెక్ట్ చేసిన జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ సాంగ్ కు ముందు అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు సాంగ్ కంపోజ్ చేశాడట దేవి శ్రీ ప్రసాద్. అయితే సాంగ్ తారక్ కు అంతగా నచ్చకపోవడంతో అది పక్కనబెట్టి పక్కా లోకల్ సాంగ్ చేశాడట. పక్కా లోకల్ సాంగ్ హిట్ అయినా దానికన్నా అమ్మడు సాంగే క్రేజ్ సంపాదించింది. కేవలం ఆడియో సాంగే సూపర్ సెన్షేషన్ క్రియేట్ చేస్తే ఇక వీడియో ఇంకెన్ని సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. 

సో అలా ఓ హిట్ సాంగ్ ను మిస్ చేసుకున్నాడు తారక్. దేవి మ్యూజిక్ తో వస్తున్న ఖైది నెంబర్ 150 మ్యూజిక్ పరంగా హిట్ అన్నట్టే. ఇక నిన్న రిలీజ్ అయిన సుందరి సాంగ్ కూడా సూపర్ అనేస్తున్నారు ఫ్యాన్స్. కత్తి రీమేక్ గా వస్తున్న ఖైది సినిమా సంక్రాంతి బరిలో దిగుతుంది. శాతకర్ణికి ఏమాత్రం తగ్గకుండా ప్రమోషన్స్ చేయాలని నిర్ణయించిన చిత్రయూనిట్ దానికి కావాల్సిన ఎరేంజ్మెంట్స్ అన్నిటిని చూసుకుంటుంది.
 
Top