గ్లామర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలతో పాటు పబ్లిసిటీ కూడ అంతే ముఖ్యము. వరుస అవకాశాలు దక్కించుకుంటున్నప్పటికీ పబ్లిసిటీ అనేది లేకపోతే వచ్చిన అవకాశాలు చేజారిపోయే ప్రమాధం ఉంటుంది. అందుకే హీరోయిన్స్, హీరోలు ఇలా ఎవరైనా సరే పబ్లిసిటి కోసం ఆరాటం పడుతూనే ఉంటారు. కెరీర్ మొదట్లో ప్రతి హీరోయిన్ కోరుకునేది పబ్లిసిటీనే.

తన కంటూ ఓ స్టార్ డం ఏర్పడిన తరువాత పబ్లిసిటీ అనేది దానంతట అదే వస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం పాపులర్ పబ్లిసిటీ పొందాలంటే కొంత మనీ పే చేయాల్సి ఉంటుంది. తాజగా ఓ మ్యాగజైన్ కి మనీ ఇచ్చి కవర్ పేజ్ లకి ఫోజులిచ్చింది సౌత్ హీరోయిన్. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపులర్ మ్యాగజైన్ అయినJFW, 8వ వసంతోత్సవ వేడుకలను జరుగుపుకుంటుంది.
దీని సందర్భంగా స్పెషల్ మ్యాగజైన్ ని రిలీజ్ చేసింది. అందులో తమన్న తన హాట్ హాట్ లుక్స్ తో అధరగొట్టింది. అయితే తమన్న JFWమ్యాగజైన్ 8వ వార్షికోత్సవ కవర్ పేజ్ లో కనిపించడంపై రకరకాల టాక్స్ వినిపిస్తున్నాయి. కోలీవుడ్ లోని ప్రముఖ ఛానల్ కథనం ప్రకారం, తమన్న దాదాపు 2 లక్షల రూపాలను ఇచ్చి, JFW స్పెషల్ మ్యాగజైన్ కి కవర్ పేజ్ గా నిలిచిందట.
అయితే ఈ విషయంపై తమన్నని కొందరు రిపోర్టర్స్ అడగగా, అందంతా ట్రాష్ అంటూ కొట్టిపారేసింది. నిజానికి చాలా మంది హీరోయిన్స్ తమన్నా లాగే మనీని పే చేసుకొని పబ్లిసిటినీ కోరుకుంటారు. ఆ విధంగానే ఈ బ్యూటీ ఫాలోయింది. అయితే ఇక్కడ మనీ విషయం బయటకు రావటంతో అంత రచ్ఛ రచ్ఛగా మారింది.
 
Top