ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని అతి పెద్ద
హీరోలలు వరుస చిత్రాలలో నటించడం అనేది అంత సులువైన పని ఎంత మాత్రం
కాదు. కాని కింగ్ నాగార్జున సైతం ఒక్కసారిగా తన స్పీడుని పెంచాడు. గతంలో
సంవత్సరానికి ఒకటి, రెండు మూవీలలో మాత్రమే నటిస్తూ వచ్చిన
నాగార్జున, ప్రస్తుతం ఏకంగా 4 చిత్రాలని అంగీకరించి వాటిలో రెండు
చిత్రాలలో ఇప్పటికే షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
దీనికి
సంబంధించిన వివరాలలోకి వెళితే, సీనియర్ స్టార్ హీరో అయిన కింగ్ నాగార్జున
ప్రస్తుతం రెండ సినిమాల షూటింగ్ లతో బిజీ బిజీగా ఉన్నాడు. గత కొద్ది
రోజులుగా హాలిడే సీజన్ ని ఎంజాయ్ చేస్తున్న నాగార్జున త్వరలోనే సినిమా
షూటింగ్ లతో బిజీ కానున్నాడు. నాగార్జున కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో
‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా చేస్తుంటే, వంశీ పైడి పల్లి డైరెక్షన్ లో
కార్తీతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు.
సోగ్గాడే
చిన్ని నాయనాకి సంబందించిన టాకీ పార్ట్ చాలా వరకూ పూర్తయ్యింది. ఈ మూవీ
లాస్ట్ షెడ్యూల్ జూన్ 26 నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. జూలై మొదటి
వారం వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుంది. సోగ్గాడే చిన్ని నాయనా షెడ్యూల్ పూర్తి
కాగానే జూలై 10 తర్వాత నుంచి నాగార్జున వంశీ పైడి పల్లి సినిమాకి షిఫ్ట్
అవుతాడు. ఈ సినిమాలో నాగార్జున ఇది వరకూ కనిపించని ఓ డిఫరెంట్ లుక్,
డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నాడు.
తమన్నా
ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. ఇటీవలే ఈ సినిమా దుబాయ్ షెడ్యూల్ ని
పూర్తి చేసుకొని వచ్చింది. ఉయ్యాలా జంపాలా ఫేం రామ్ మోహన్ సోగ్గాడే చిన్ని
నాయనా సినిమాని నిర్మిస్తుంటే, పివిపి సినిమాస్ వారు నాగార్జున, కార్తీ,
వంశీ పైడిపల్లి సినిమాని నిర్మిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు కాకుండా మరో
రెండు చిత్రాలను ఈ సంవత్సరం చివరి నెలలోనే దాదాపు పూర్తి చేసే పనిలో
ఉన్నాడు ఈ యువసామ్రాట్.