తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి తనయుడిగా వెండితెరకు పరిచయం అయి అతి
తక్కువ టైమ్ లోనే మెగా పవర్ స్టార్ గా ఎదిగిన హీరో రాంచరణ్. కృష్ణ వంశి
దర్శకత్వంలో ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమా తర్వాత చాలా గ్యాప్ వచ్చింది.
ఇప్పుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలో
నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ యూరప్ లలో రెండు షెడ్యుల్ లు పూర్తి
చేసుకుంది. తర్వాత ఓల్డ్ సిటీలో కొన్ని ఫైటింగ్ సీన్లు తీశారు.