‘స్వామిరారా’, ‘కార్తికేయ’ లాంటి వరుస విజయాల తరువాత కూడ కలర్స్ స్వాతికి టాలీవుడ్ సినిమాలలో అవకాశాలు రాకపోవడంతో తిరిగి కోలీవుడ్ లో అవకాశాలు వెతుక్కుంటూ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈమె కోలీవుడ్ లో చేస్తున్న సినిమాల టైటిల్స్ కూడ చాలా వెరైటీ గా ఉన్నాయి. స్వాతి ప్రస్తతం తమిళంలో చేస్తున్న సినిమాల పేర్లు ‘డబల్ బేరల్’, ‘అమలి తుమలి’. 

వెబ్ మీడియాలో ఎప్పుడు సందడి చేసే ఈ తెలుగమ్మాయి ఇన్ స్టా గ్రామ్ లో తన సినిమాలకు సంభందించిన లేటెస్ట్ లుక్ ఫోటో ఒకటి పెట్టింది. అయితే ఈ ఫోటోలను చూసిన స్వాతి అభిమాని ఒకడు షాక్ అయి ఇలాంటి ఫోటోలు పెట్టవద్దు ఆంటీ లా కనిపిస్తున్నావు అంటూ స్వాతి పై సెటైర్లు వేసాడు. దీనితో కోపం తెచ్చుకున్న స్వాతి ఆ అభిమానిపై రివర్స్ సెటైర్లు వేసింది. 

‘అవును నేను ఆంటీనే ఒప్పుకుంటున్నా ఇప్పుడు నేను ఒకప్పటి 16 ఏళ్ళ కలర్స్ స్వాతిని కాదు కదా అంకుల్’ అంటూ రివర్స్ పంచ్ వేసింది. అంతేకాదు సోషల్ మీడియాలో ఇలాంటి ఆంటీ కామెంట్స్ తన పై ఎన్ని వచ్చినా పట్టించుకోను  అంటూ ఆంటీ అన్నపదం పై తనకు గౌరవం ఉంది అంటూ కామెంట్స్ చేసింది స్వాతి.

అయితే కలర్స్ స్వాతి కామెంట్స్ చదివిన వారు అంతా స్వాతికి నచ్చిన అబ్బాయి ఇంకా దొరకపోవడంతో ఇలా ఆమెకు కోపం పెరిగి పోతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ వార్ ఎలా ఉన్న కలర్ స్వాతి లేటెస్ట్ లుక్ మాత్రం చాలామందికి షాక్ ఇచ్చింది అన్న విషయం నిజం..
 
Top