‘బాహుబలి’ సినిమా గురించి రోజుకొక ఆశక్తికర వార్త హడావిడి చేస్తోంది. ఈ వార్తలతో ‘బాహుబలి’ క్రేజ్ తారస్థాయికి పెరిగిపోతోంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమా క్లైమాక్స్ గురించి వస్తున్న వార్తలు అందరి మైండ్ ను బ్లాంక్ చేస్తున్నాయి. ‘బాహుబలి’ క్లైమాక్స్‌ సీన్‌ దాదాపు 30నిమిషాల పాటు సాగుతుందట. 

ఆ సీన్‌ఈ  సినిమా మొత్తానికే హైలైట్‌ అని అంటున్నారు ఈ 30నిమిషాల కోసం దాదాపు 30కోట్లు వరకు రాజమౌళి ఖర్చు పెట్టాడు అని టాక్. మహాభారత యుద్దాన్ని తలపించే విధంగా ఈ క్లైమాక్స్ స్కీన్స్ ఉంటాయని అంటున్నారు. అంతే కాదు ఇండియన్‌ సినిమా హిస్టరీలోనే ఇలాంటి సీన్స్‌ ఎప్పుడు రాలేదు అనే విధంగా క్లైమాక్స్ చిత్రీకరణ విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా బాహుబలి విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ఈ సినిమా పబ్లిసిటీ విషయంలో బాలీవుడ్ మూవీ ‘ధూమ్3’ అనుసరించిన విధానాన్నే ‘బాహుబలి’ యూనిట్ కూడ అనుసరిస్తుంది అంటున్నారు. ‘ధూమ్3’ నిర్మాణ కర్త ఆదిత్యా చోప్రా ఆ సినిమాకు సంబంధించిన పాటలను టెలివిజన్ సెట్స్ పై ప్రసారం చేయకుండా ఒకేసారి పెద్దతెర పై చూపెట్టి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసినట్లుగా ‘బాహుబలి’ పాటలను కూడ బుల్లితెర పై చుపెట్టకుండా ఒకేసారి ధియేటర్లలోని పెద్ద తెర పై ప్రేక్షకులు ఆశ్చర్య పడేలా చూపెట్టాలని రాజమౌళి ఆలోచన అని అంటున్నారు. 

ఇది ఇలా ఉండగా ఈసినిమా విడుదల విషయంలో ఆఖరి నిముషంలో సమస్యలు రాకుండా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలను ఈ నెలాఖరుకే పూర్తిచేసి బయ్యర్లకు డిస్ట్రిబ్యూటర్లకు పాజిటివ్ సంకేతాలను పంపే వ్యూహాత్మక ఎత్తుగడలో రాజమౌళి ఉన్నాడని తెలుస్తోంది. రెండు గంటల 35 నిముషాలు ఉండే ‘బాహుబలి’ బిగినింగ్ సంబంధించి బుల్లితెర పబ్లిసిటీని ఈ నెలాఖరు నుండే చాల విభిన్నంగా ఈ సినిమాలో నటించిన నటీనటులు అందర్నీ ఇన్వాల్వ్ చేస్తూ రాజమౌళి చాల విభిన్నంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అని టాక్..
 
Top