తెలుగు  సినిమా రంగం మరిచిపోలేని మహోన్నత దర్శకులలో బాపు ఒకరు. ఆయాన మన నుండి దూరం అయిపోయినా ఆయన సినిమాల స్థాయిలో అచ్చతెలుగు సినిమాలను తీయగల దర్శకులు మరెవ్వరూ లేరు. అయితే ఆయన సినిమాలన్నిటిలోను రామాయణ మహాభారత కథలు అంతర్లీనంగా కనిపిస్తాయి. ఇప్పుడు అదే పద్ధతిని తాను అనుసరిస్తున్నట్లుగా టాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి అధికారికంగా తెలియచేసాడు. 

ఇండియన్ సినిమా చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ హంగులు, గ్రాఫిక్స్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి' చిత్రం గురించి రాజమౌళి ఒక ఆశక్తికర విషయాన్ని లీక్ చేసాడు.  ‘మహాభారతం' ఆధారంగానే ‘బాహుబలి’ కథను తయారు చేసుకున్నానని ఆ కథకు ఇన్స్‌స్పిరేషన్ మహాభారతమే అని అంటూ తన సినిమాలన్నీ ‘మహాభారతం', ‘రామాయణం' స్టోరీల నుండి ఇన్స్‌స్పైర్ అయి తీసినవే అన్న విషయాన్ని రాజమౌళి స్పష్టం చేసాడు.

అంతేకాదు తన చిన్నతనం నుండి మహాభారతం, రామాయణం నుండి తెలుసుకున్న అనేక విషయాలను తన సినిమాలలో సీన్స్ గా మలిచానని రాజమౌళి చెప్పుకొచ్చాడు. బాహుబలి ది బిగినింగ్ ట్రైలర్ ఆవిష్కరణ మీట్ లో రాజమౌళి ఈ వ్యాఖ్యలు చేసాడు. 

ఈ వార్తలు ఇలా ఉండాగా ఎట్టి పరిస్తుతులలోను ‘బాహుబలి’ సినిమాను అనుకున్న జూలై 10న విడుదల చేసి తీరాలని బాలీవుడ్ నిర్మాత మరియు ‘బాహుబలి’ ప్రజెంటర్ కరణ్ జోహార్ రోజురోజుకు తన ఒత్తిడిని రాజమౌళి పై పెంచడంతో పైకి కనిపించక పోయినా రాజమౌళి విపరీతమైన టెన్షన్ ఈ సినిమా విషయమై పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకుండా ఉన్న నేపధ్యంలో కరణ్ జోహార్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనేమో అన్న టెన్షన్ రాజమౌళికి బాగా ఉంది అని మాటలు వినపడుతున్నాయి..
 
Top