తెలుగు ప్రేక్షకులు మెగా అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మళ్లీ తెరపై ఎప్పుడు కనిపిస్తాడా అని వెయ్యికళ్లతో ఎదురు చూస్తుండగా మంచి తీపికబురు అందింది. గబ్బర్ సింగ్ 2 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం పూణేలో అయ్యినట్లు చిత్ర యూనిట్ తెలిపారు. ఈ చిత్రానికి పవర్ సినిమా డైరెక్టర్ బాబీ తన ట్విట్ లో పవన్ తో సినిమా తీయడం తన అదృష్టంగా భావిస్తున్నానని తన ట్విట్ లో పోస్ట్ చేశాడు.

మాజీ భార్య రేణూ దేశాయ్, కూతురు ఆద్య తో పవన్ కళ్యాన్

 

ప్రస్తుతం షూటింగ్ పూణేలో జరుగుతుంది మరో విషయం ఏమిటంటే పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ అక్కడే తన పవన్ పిల్లలలో ఉంటుంది. ఎలాగూ పూణే దగ్గర షూటింగ్ కాబట్టి షూటింగ్ అయిపోయిన తర్వాత పవన్ తన పిల్ల దగ్గరకు వెళ్లడం వాళ్లతో సంతోషంగా గడపడం ఖాయమని తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాన్ కి అఖిరానంద్, ఆద్య అంటే చాలా ఇష్టం మామూలుగానే తిరిక దొరికినపుడు పిల్లల వద్దకు వెళ్లి వాళ్లతో గడిపిరావడం పవన్ కి అలవాటు ఇక షూటింగ్ స్పాట్ దగ్గరలోనే కాబట్టి మరింత సమయం గడపవచ్చు అని అభిప్రాయ పడుతున్నారు. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన అనీషా అంబ్రోస్ ఒక హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ కోసం వెదుకుతున్నారు .

 
Top