యువత దేశానికి ఓ సంపద.. వారి ఆలోచన ఓ ఆయుధం.. అటువంటి యువత ఈ వైఫై యుగంలో ఎలాంటి అడుగులు వేస్తోంది..? అత్యంత కీలకమైన ఈ దశను యువత సంపూర్ణంగా అనుభవిస్తోందా? లేక హద్దులు దాటి దారి తప్పుతోందా? అనే సున్నితమైన అంశంతో తెరకెక్కిన చిత్రం 'టెన్త్‌లో లక్, ఇంటర్‌లో కిక్, బీటెక్‌లో..?'. డైరెక్టర్ మంచి వెంకట్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మి తిరుపతమ్మ ఫిల్మ్స్ నిర్మించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 5న విడుదల కాబోతోంది. స్టూడెంట్స్ కు కాంటెస్ట్సి నిమా విడుదల సందర్భంగా స్టూడెంట్స్ కు ఓ కాంటెస్ట్ నిర్వహించబోతోంది చిత్రయూనిట్. సినిమా చూసి ఆ టికెట్ నంబర్, పేరు టైప్ చేసి 9000660128 నంబర్ కు ఎస్ఎమ్ఎస్ చేయాలని చిత్ర యూనిట్ తెలిపింది. ఎస్ఎమ్ఎస్ చేసిన వారిలో నుంచి 10 మంది లక్కి విన్నర్స్ ను ఎంపిక చేస్తామని చెప్పారు. మొదటి బహుమతిగా ల్యాప్ టాప్ అందిస్తామని, మిగతా తొమ్మిది మంది విన్నర్స్ కి 9 స్మార్ట్ ఫోన్ లు ప్రముఖ హీరోయిన్ చేతుల మీదుగా అందించబడుతుందని చిత్రయూనిట్ తెలిపింది. ఈ అవకాశం స్టూడెంట్స్ కు మాత్రమేనని, సినిమా విడుదలైన మూడు రోజుల వరకు ఈ కాంటెస్ట్ ఉంటుందని తెలిపారు. 

'టెన్త్‌లో లక్, ఇంటర్‌లో కిక్, బీటెక్‌లో..?' పోస్టర్

 

ఈ సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ తో పాటు యూత్ కి ఓ మంచి మెసేజ్ ఇవ్వబోతున్నట్టు డైరెక్టర్ మంచి వెంకట్ తెలిపారు. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం యూత్ ని అలరిస్తుందన్నారు. సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందని, సినిమా కూడా యూత్ అందరికి కనెక్ట్ అవ్వడం ఖాయమని ఆయన తెలిపారు.
ఇక ఈ సినిమాలో హరీష్, జై, విష్ణు, కీర్తి, గీతాంజలి, కావేరి నటీనటులుగా ఇతర పాత్రల్లో తాగుబోతు రమేష్, జబ్బర్ దస్త్ ఫేం.. సుధీర్, శ్రీను, రచ్చ రవి, చిట్టి, నాగిరెడ్డి, జగదీశ్వరీ తదితరులు నటించారు.  ఎడిటింగ్: అమర్ పొల్లా, మ్యూజిక్: జేఎస్ రాజ్, కెమెరా: జి. అమర్, కొరియోగ్రఫీ: శామ్యూల్, చిత్ర సమర్పకులు: చింతల సురేందర్ యాదవ్, కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం వెంకట్ మంచి.
 
Top