బాహుబలి బిగినింగ్ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు.. మొదట్లో మిక్స్ డ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల వసూళ్లలో మాత్రం కొత్త రికార్డులు సృష్టించేసింది. సరే పార్ట్ వన్ అంటే.. ఇంట్రస్ట్ తో.. బాహుబలికి వచ్చిన క్రేజ్ తో ఏం తీసినా చూసేశారు. కానీ పార్ట్ 2 మాత్రం అలా కాదు కదా.. ఇప్పటికే స్టోరీ సగం తెలిసింది. మిలిగిన సగాన్ని కూడా ప్రేక్షకుల అంచనాలకు అందకుండా తీర్చిదిద్దాలి.

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు.. ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.. దీనిపై సెటైర్లు, స్ఫూఫులు కూడా నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రశ్నకు బలమైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాజమౌళిపై ఉంది. దీనికి తోడు అసలైన కథంతా సెకండ్ పార్ట్ కోసమే అట్టిపెట్టాడని ఇప్పటికే టాక్ నడుస్తోంది. ఫస్ట హాఫ్ సాధించిన బ్రహ్మాండమైన విజయంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. 

టాలీవుడ్ స్థాయి పెంచిన బాహుబలితో.. సరికొత్త రికార్డులపై కన్నేశాడని రాజమౌళిపై టాక్ నడుస్తోంది. అందుకే ముందు అనుకున్న కథలో చాలా మార్పులు చేశారట. ఆ మార్పుల కసరత్తు ఇప్పటికి ఓ కొలిక్కి వచ్చిందట. మొత్తానికి బాహుబలి ది ఎండింగ్ స్టోరీ పక్కాగా రెడీ అయ్యిందట.  

బాహుబలి ది ఎండింగ్ స్టోరీ సిద్దం అయింది. సహజంగా ఏ విషయంలోనూ ఓ పట్టాన సంతృప్తి చెందని రాజమౌళి కూడా చివరికి స్ర్కిప్ట్‌ బాగా వచ్చిందని సంతోషంగా ఉన్నారట. ఫైనల్ స్క్రిప్ట్ రెడీ కావడంతో టీమ్ మొత్తాన్ని పిలిచి ఆ వివరాలు చెప్పారట. ఒక్కొక్కరికి చెప్తే లేటవుతుందని.. అందరినీ ఆఫీస్‌కు పిలిపించుకుని డిటైల్స్ వివరించారట. సో.. టీమ్ అంతా ఫోటోకి పోజిచ్చి సోషల్‌ నెట్‌వర్కింగ్ సైట్‌లలో పోస్ట్ చేసేస్తున్నారు. వచ్చే వేసవిలో విడుదల కానున్న ఈ సెకెండ్ పార్ట్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో.
 
Top