పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతటి స్టార్ ప్రొడ్యూసర్ అయినా పవర్ స్టార్ తో ఒక సినిమా తీయాలని తెగ ట్రై చేస్తుంటారు. అయితే చిరు బర్త్ డే తర్వాత రోజు దిల్ రాజు చిరు మేనళ్లుడు తో తీసిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఆడియో రిలీజ్ లో పవర్ స్టార్ డేట్స్ దొరికాయనని ఎనౌన్స్ చేశాడు. అయితే రీసెంట్ గా దిల్ రాజు తన బ్యానర్ పేరిట మూడు కొత్త టైటిల్స్ రిజిస్టర్ చేయించడం అందరిని ఆశ్చర్యానికి షాక్ కి గురి చేస్తుంది.

దిల్ రాజు రిజిస్టర్ చేసిన మూడు టైటిల్స్ ఏంటంటే.. జనగణమన.. ఎవడో ఒకడు.. సుప్రీం. అయితే ఇందులో జనగణమన మాత్రం పవన్ కళ్యాణ్ కోసమే అని అందరు అనుకుంటున్నారు. ఏదో ఒకరోజు సెన్షేషనల్ న్యూస్ ఒకటి ఎనౌన్స్ చేసినా చేసేస్తాడు దిల్ రాజు. ఆ మధ్య కాస్త వెనక్కు తగ్గి చిన్న సినిమాలు చేసుకుంటూ వచ్చిన రాజు కాస్త మళ్లీ పెద్ద హీరోల సినిమాల వెంట పడ్డాడు.  అయితే కన్ఫాం గా తెలియక పోయినా దిల్ రాజు జనగణమన టైటిల్ రిజిస్టర్ చేయించింది మాత్రం పవర్ స్టార్ సినిమా కోసమే అనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తుంది. 

ఇక ఎవడో ఒకడు అనేది ఎవరికో తెలియదు కాని ఇక సుప్రీమ్ ని మాత్రం తాను మరళ సాయి ధరంతేజతో చేసే సినిమా టైటిల్ అది అయ్యిండొచ్చని భావిస్తున్నారు. అంతేకాదు ఆ సినిమాతో మెగా మేనళ్లుడు సాయిధరం తేజ కి కూడా సుప్రీం స్టార్ అనే స్టార్ స్టేటస్ ని ఇద్దామని డిసైడ్ అయ్యారట. మొత్తానికి సూపర్ ప్లాన్ తో ముందుకొతున్నాడు దిల్ రాజు.

అయితే దిల్ రాజు జనగణమన టైటిల్ రిజిస్టర్ పవన్ కోసమే అని తెలిసినప్పటినుండి పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఎక్జైటింగ్ గా ఉన్నారు. ఇక ఆ సినిమా దర్శకుడు ఎవరు.. అందులో పవర్ స్టార్ సరసన నటించేది ఎవరు అనే డీటేల్స్ ఇంకా తెలియాల్సి ఉంది.
 
Top