పవన్ కళ్యాణ్ ఆలోచనలను వరుణ్ తేజ్ ‘కంచె’ అయోమయానికి గురిచేస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. ఈసినిమా ఆడియో ఫంక్షన్ ఈనెల 17 తారీఖున వినాయకచవితి రోజున చాలా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మెగా కుటుంబ పవర్ ను చాటే విధంగా ఏర్పాటు చేయబడుతున్న ఈ ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా చిరంజీవి రావడానికి అంగీకరించాడు అన్న వార్తలు వస్తున్నాయి.

అయితే ఈసినిమా దర్శకుడు క్రిష్ ఈ ఆడియో వేడుకకు పవన్ ను కూడ ఏదోవిధంగా అతిధిగా తీసుకురావాలి అన్న ఆలోచన వచ్చి పవన్ పై ఒత్తిడి పెంచుతూ ఉండటంతో పవన్ కు ఈ విషయం మరో ఇరకాటంగా మారింది అని అంటున్నారు. పవన్ చరణ్ నటిస్తున్న ‘బ్రూస్ లీ’ సినిమాకు వాయస్ ఓవర్ ఇవ్వడానికి ఇంచుమించు అంగీకరించిన నేపధ్యంలో వరుణ్ తేజ్ ‘కంచె’ ఫంక్షన్ కు రాకపోతే నాగబాబుకు మరింత కోపాన్ని తెప్పిస్తుంది కాబట్టి ఈ విషయం నుండి తెలివిగా ఎలా బయట పడాలి అని ఆలోచిస్తున్నట్లు టాక్. 

ఇప్పటికే ఈసినిమా ట్రైలర్ ను చూసి వరుణ్ తేజ్ ను అభినందించిన పవన్ క్రిష్ ఒత్తిడికి తట్టుకోలేక వరుణ్ తేజ్ కోసం ఈ ఆడియో ఫంక్షన్ కు వచ్చి తన అన్న చిరంజీవితో పాటు వేదికను షేర్ చేసుకుంటేమటుకు ఈసినిమాకు మరింత క్రేజ్ ఏర్పడటం ఖాయం అని అంటున్నారు. 

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈసినిమాను కూడ ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ పద్ధతిలో తమిళ, హిందీ భాషలలో డబ్ చేస్తూ ఒకేసారి అక్టోబర్ 2న అత్యధిక ధియేటర్ల సంఖ్య స్థాయిలో విడుదలచేసి భారీ ఓపెనింగ్స్ పై ‘కంచె’ కన్నేసింది అని అంటున్నారు. మరి ఈ ఆడియో వేడుకకు పవన్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో చూడాలి..
 
Top