తెలుగు ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా పేరు పొందిన రాంగోపాల్ వర్మ ఈ మద్య ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను బాహాటంగా వెల్లబుచ్చుతున్నాడు. ఈ మద్య చిరంజీవిపై తన ట్విట్టర్ లో కామెంట్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు... బ్రూస్ లీ యూనిట్ చెబుతున్న లెక్కలు ఎలా ఉన్నా, తను మాత్రం చిరంజీవిని 150వ సారి వెండితెర మీద చూశానని, ఇదే చిరు 150వ సినిమా అంటూ తేల్చేశాడు వర్మ. 

చిరు  151వ సినిమా మాత్రం ఎంటర్ ద డ్రాగన్ లాంటి మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నానన్నాడు. చిరంజీవి తమిళ సినిమాను దిగుమతి చేసుకుని నూట ఏభై వ సినిమాలో నటించడం తెలుగువారిని అవమానించడమేనని ఆయన అంటున్నారు.తెలుగు కధతోనే సినిమా తీయాలని మెగాస్టార్ ను అబిమానులు డిమాండ్ చేయాలని ఆయన అన్నారు.151 వ సినిమా మాత్రం తమిళ సినిమా కాపీ కారాదని ఆయన వ్యాఖ్యానించారు.

బ్రూస్ లీ చిత్రంలో చిరంజీవి, రాంచరణ్

ఇక మెగా ఫ్యామిలీపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'కామెంట్ల' దాడి కొనసాగుతూనే ఉంది. చిరంజీవి నివాసానికి వెళ్లి రామ్ చరణ్ తో కలసి పవన్ కల్యాణ్ దిగిన ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి... 'నయాగరా జలపాతం తర్వాత అంతటి గొప్ప ఫొటో ఇదే' అంటూ కామెంట్ చేశాడు. అంతే కాదు చిరంజీవి, పవన్ కల్యాణ్ లు కలవడం కల అనుకున్నానని... తీరా లేచి చూశాక అది నిజమని నిర్ధారించుకున్నానని ట్వీట్ చేశాడు. అయితే రాంచరణ్ బ్రూస్ లీ సినిమా చూశానని రామ్ చరణ్ అద్భుతంగా ఉన్నాడని వర్మ చెప్పాడు.  

రాంగోపాల్ వర్మ ట్విట్ : 

 
Top