ఇండియన్
ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా బాహుబలి మూవీ కోసం ఎదురుచూస్తుంటే, టాలీవుడ్
ఇండస్ట్రీ అంతా ప్రభాస్ పెళ్ళి కోసం ఎదురుచూస్తుంది. దీనికి సంబంధించిన
వివరాల్లోకి వెళితే, తెలుగు చిత్రసీమలో తాజాగా పెళ్ళిళ్ళ కారణంగా
జరుగుతున్న హడావుడీ ఇంతా అంతా కాదు. టాలీవుడ్ లోని ఎలిజిబుల్
బ్యాచిలర్స్, యంగ్ హీరోస్ మంచు మనోజ్, అల్లరి నరేశ్ వారం తేడాతో ఎంచక్కా
పెళ్ళి పీటలెక్కేశారు.
అలాగే కమెడియన్ తాగుబోతు రమేశ్, 'లవ్ టచ్' హీరో జయంత్ రెడ్డి సైతం పెద్దల అంగీకారంతో మూడు ముళ్ళూ వేసేశారు. దాంతో ఇప్పుడు అందరి దృష్టీ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ మీద పడింది.'బాహుబలి' సినిమా కారణంతో ఇంతకాలం తన పెళ్ళిని వాయిదా వేస్తూ వచ్చిన ప్రభాస్, ఇక ఆ మూవీ పూర్తి కావడంతో తన పెళ్ళిని వాయిదా వేయలేకపోతున్నాడు.
'బాహుబలి' ఆడియో ఆవిష్కరణ వాయిదా విషయాన్ని తెలియడానికి మీడియా ముందుకొచ్చిన ప్రభాస్ పనిలో పనిగా తన పెళ్ళి విషయంలోనూ కాస్తంత క్లారిటీ ఇచ్చాడు. 'బాహుబలి'తర్వాత కొత్త సినిమా అంగీకరిస్తారా? లేక పెళ్ళి పీటలెక్కేస్తారా? అని అడిగిన ప్రశ్నకు ప్రభాస్ పాజిటివ్ గా స్పందించాడు. కొత్త సినిమాకు పెళ్ళికి సంబంధం లేదని, మ్యారేజ్ జరిగిపోతుందని చెప్పుకొచ్చాడు.
దాంతో ఇదే సంవత్సరం ప్రభాస్ ఓ ఇంటివాడు కావడం ఖాయమని స్పష్టమైంది. ఫ్యామిలీ మెంబర్స్ కోరిక మేరకు వారు ఎంపిక చేసిన అమ్మాయికే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, కాబట్టి... ఈ యేడాది నవంబర్, డిసెంబర్ నెలలో ఖచ్చితంగా అతని పెళ్ళి జరిగిపోతుందని అంటున్నారు.