ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్ గా వినిపిస్తున్న న్యూస్ బాహుబలి. బాహుబలి మూవీ దర్శకుడిగా రాజమౌళి పేరు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హైలైట్ వినపడుతుంది. ఇదిలా ఉంటే మొదటి ఇండియన్ మోషన్ పిక్ఛర్ గా బాహుబలి మూవీని ఇండియన్ స్క్రీన్స్ అంతటా రిలీజ్ చేయటానికి రాజమౌళి ప్లానింగ్ చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే ఈ మూవీ కచ్ఛితంగా గ్రాండ్ సక్సెస్ ని సాధించడం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాలతో పాటు బిజినెస్ వర్గాలు అన్ని కాన్ఫిడెంట్ తో ఉన్నాయి. దీంతో ప్రముఖ కార్పోరేట్ సంస్థ అయిన వయాకామ్ పిక్ఛర్స్, రాజమౌళితో రెండు భారీ సినిమాల ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.

ఆ రెండు సినిమాల రెమ్యునరేషన్ గా రాజమౌళి దాదాపు వంద కోట్ల రూపాయల ప్యాకేజ్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తను తెరకెక్కించిన అప్ కమింగ్ ఫిల్మ్ బాహుబలి అప్ డేట్స్ విషయానికి వస్తే, రాజమౌళి,రానా ఇద్దరు కలిసి టీవీ 5 స్టూడియోలో టీజర్‌ను విడుదల చేశారు. ఈ పది సెకండ్ల టీజర్‌ చూసిన వారెవ్వరైనా వారెవ్వా అనకుండా ఉండలేరు.
కేవలం ఐదారు షాట్స్ చూస్తేనే ఈ స్థాయి అనుభూతి కలిగితే ఇక సినిమా ఇంకెంత అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందోనని అభిమానులు సోషల్ మీడియోలో తమ ఆనందాన్ని పంచుకున్నారు. బీభత్సకరంగా ఉన్న రానాను, రౌద్రరసం నిండిన ప్రభాస్ కళ్ళను ఈ టీజర్‌లో చూడొచ్చు. ఇక జూన్ 1న ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుంది. ఇప్పుడు బాహుబలి అభిమానుల కళ్ళన్నీ ఆ ట్రైలర్‌పైనే ఉన్నాయి.
 
Top