mahesh brammostavam movie
మహేష్ బాబు నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ బ్రహ్మోత్సవం. ఈ మూవీలో మహేష్ బాబుకి సంబంధించిన టాప్ 5 హైలైట్స్ ఉన్నాయంటూ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా ‘బ్రహ్మోత్సవం’.
ప్రతిష్టాత్మక పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ ఉదయం బ్రహ్మోత్సవం ముహూర్తం కార్యక్రమాలు జరుపుకుంది. ఇక నేటినుంచే అధికారికంగా షూటింగ్ కూడా ప్రారంభమైనట్టు నిర్మాణ సంస్థ తెలిపింది. అయితే ఈ మూవీలో మహేష్ బాబు పూర్తి ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరోగా కనిపించనున్నాడు. మధ్య మధ్యలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు తప్పితే, సినిమా మొత్తం కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతుంది.
ఇదే మూవీలో మహేష్ బాబు తనయుడు గౌతమ్ మరోసారి కనిపించే అవకాశం కూడ ఉంది. అలాగే సూపర్ స్టార్ క్రిష్ణ సైతం బ్రహ్మోత్సం మూవీలో కనిపించే అవకాశం ఉంది. అలాగే సధీర్ బాబు కూడ బ్రహ్మోత్సం మూవీలో కొద్దిపాటి నిముషాలు కనిపించబోతున్నాడంటూ టాక్స్ వినిపిస్తున్నాయి.
అయితే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అతి తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేయటానికి మహేష్ బ్రేక్స్ లేకుండా వరుస కాల్షీట్స్ ని ఇవ్వడం కూడ విశేషంగా మారింది. ఇక సినిమా లాంచ్ సందర్భంగా విడుదల చేసిన ‘బ్రహ్మోత్సవం’ లోగోలో తెలుగుదనంతో పాటు, టైటిల్ హుందాతనం ఉట్టిపడుతోంది. పేరుకు తగ్గట్టుగానే లోగోలో బ్రహ్మోత్సవ కళ వెలిగిపోతోంది.
 
Top