hunter hot scenes
బుల్లితెర ఇండస్ట్రీ అంటే తక్కువ బిజినెస్ అని ఎంత మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. దాదాపు సినిమా ఇండస్ట్రీతో పాటు బుల్లితెర ఇండస్ట్రీ సైతం కోట్ల రూపాయల డీలింగ్స్ చేస్తుంటుంది. ఎంత పెద్ద మూవీ అయినాసరే ఫైనల్ గా అది టెలికాస్ట్ కావాల్సింది బుల్లితెరలోనే. అప్పుడే దానిని అందరూ చూస్తారు. సరిగ్గా సౌత్ స్టార్ హీరోయిన్ రాధికాఆప్టే నటించినఓ అడల్డ్ మూవీ, ఇప్పుడు టెలివిజన్స్ లో టెలికాస్ట్ అవ్వటానికి సిద్ధంగా ఉంది.
దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, బాలీవుడ్‌లో అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలకు డిమాండ్ ఉంటుంది. సెన్సార్ బోర్డ్ దగ్గర జస్ట్ అలా సర్టిఫికేట్ తీసుకున్న వెంటనే, దానిని బుల్లితెరలో టెలికాస్ట్ చేసేస్తారు. ఇదే కోవలో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన హంటర్ సినిమా కూడా రసిక ప్రియుల హృదయాలను కొల్లగొట్టింది. అయితే థియేటర్లకు చేరుకునేందుకే సెన్సార్ బోర్డ్ తో లెక్కలేనన్ని మొట్టికాయలు వేయించుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ఏ ఇబ్బందీ లేకుండా టీవీల్లోనూ టెలీకాస్ట్ అయిపోయేందుకు సిద్ధమైపోతోంది.

సాధారణంగా A రేటింగ్‌తో థియేటర్లలో ప్రదర్శితమైన ఏ చిత్రమైనా.. టీవీల్లో టెలీకాస్ట్ అవ్వాలంటే... మరోసారి సెన్సార్ అయ్యి U/A సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. అయితే గుల్షన్, రాధికా ఆప్టే జంటగా నటించిన 'హంటర్' అనే అడల్ట్ మూవీ... ఇప్పటివరకూ టీవీ స్క్రీనింగ్ నిమిత్తం సెన్సార్ బోర్డ్ వద్దకే వెళ్లలేదట. అయినప్పటికీ త్వరలో ఈ సినిమాను టెలీకాస్ట్ చేయబోతున్నట్లు ప్రోమోలు కూడా వేసేసుకుంటోంది ఓ ఛానల్.
 
Top