టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ డేటింగ్ కల్ఛర్ చాలా కామన్ గా ఉంటూ వస్తుంది. అయితే తాజా పరిణామాలను ఓసారి చూసుకుంటే ఇది బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీని మించి టాలీవుడ్ లో ఉందనే పీలింగ్ ఉంది. మొత్తంగా టాలీవుడ్ కి చెందిన అప్ కమింగ్ హీరోయిన్ తో అప్పుడే యంగ్ హీరోలు డేటింగ్ చేస్తున్నారనే టాక్స్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.
దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, యూ ట్యూబ్ లో పాపులర్ అయిన ఓ యూ ట్యూబ్ హీరోయిన్ తో టాలీవుడ్ యంగ్ హీరోలు డేటింగ్ చేయటానికి ఇష్టపడుతున్నారట. అయితే గడుసు అమ్మాయి కావటంతో యంగ్ హీరోలకు అప్పుడే అంత ఛాన్స్ ఇవ్వటం లేదు. షార్ట్ ఫిల్మ్స్ నుంచి సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇస్తున్న మరో హీరోయిన్ చాందిని చౌదరి. చాందిని చౌదరి నటించిన షార్ట్ ఫిల్మ్స్ కు యూ ట్యూబ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
క్యూట్ లుక్స్ తో వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ వైజాగ్ బ్యూటీ జాక్ పాట్ కొట్టి టాలీవుడ్ హీరోయిన్ గా ప్రమోట్ అయింది. ప్రసుతం చాందిని కుందనపు బొమ్మ,కేటుగాడు అనే సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.
నిన్ననే ఈ రెండు సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ విడుదలయ్యాయి. ఫస్ట్ లుక్స్ అందరిని ఎట్రాక్ట్ చేసిన చాందినితో, యంగ్ హీరోలు అప్పుడే డేటింగ్, ఎఫైర్స్ అంటూ వెంటపడుతున్నారు. మొత్తానికి సినిమాలోకం ఏంటో ఇప్పుడు తెలుసొస్తుంది పాపం ఈ నయా హీరోయిన్ కి.
 
Top