‘సన్నాఫ్ సత్యమూర్తి’  ఇచ్చిన కిక్  తో మంచి జోష్ మీద ఉన్న అల్లుఅర్జున్ తన తరువాత సినిమాకు అప్పుడే హోమ్ వర్క్ ప్రారంభించాడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న  ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కు ఫైనల్ టచ్ జరుగుతోంది. అయితే ఈ వార్తలు ఇలా ఉండగా అల్లుఅర్జున్ భాగ్యనగరంలోని లగ్జరీ సెలూన్స్ చుట్టూ తిరుగుతూ చేస్తున్న హంగామా ఇప్పుడు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
బన్నీ తాను నటించబోయే కొత్త సినిమాలో ఏ హెయిర్ స్టైల్ లో కనపడితే బాగుంటుందనే ఐడియా కోసo చాలామంది హెయిర్ స్టైలిస్ట్ ల  సలహాలను తీసుకుంటున్నట్లు టాక్. ఈసినిమాలో బన్నీ లవర్ బాయ్ గా కనిపించబోతు ఉండటంతో కొంచెం డిఫరెంట్ గా కనిపించడానికి తన హెయిర్ స్టయిల్  కూడ మార్చుకోవాలని ప్రయత్నంలో భాగంగానే ఈ హడావిడి అంటున్నారు.

ఈ వార్తలు ఇలా ఉండగా త్వరలో తన కొడుకు, భార్యతో కలిసి లండన్ విహార యాత్రకోసం లండన్ వెళ్ళబోతున్నాదని తెలుస్తోంది. బన్నీ ఆ ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన తరువాత బోయపాటి శ్రీను సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని టాక్. అయితే ఈ సినిమా గురించి ఒక ఆ శక్తికర న్యూస్ ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది. ఈ  సినిమాను నిర్మిస్తున్న అల్లుఅరవింద్ ఈ సినిమా దర్శకుడు  బోయపాటి శ్రీనుకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు అన్న వార్తలు వస్తున్నాయి.. 

ఈ సినిమా బడ్జెట్ ను ఎట్టి పరిస్తుతులలోను 40 కోట్లకు మించి ఖర్చు పెట్ట వద్దు అని చెపుతూ  గట్టి వార్నింగ్ ఇచ్చాడు అని టాక్. ఈ బడ్జెట్ కు లోబడి నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక చేసుకోమని సినిమా మధ్యలో బడ్జెట్ పెంచితే  ఆ పెంచిన  మొత్తాన్ని బోయపాటి శ్రీను పారితోషికం నుండి తగ్గిస్తానని అల్లుఅరవింద్ వార్నింగ్ ఇవ్వడంతో ఈ సినిమాకు  కొత్త హీరోయిన్ ను ఎంపిక చేస్తే ఎలా  ఉంటుంది అన్న ఆలోచన కూడ బోయపాటి మనసులో ఉంది అని టాక్.. 


 
Top