టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్డార్ డం కోసం హీరోల మధ్య, అలాగే హీరోయిన్స్ మధ్య పోటీ తత్వం పెరిగిపోతుంది. దీంతో ఏ కొద్ది అవకాశం వచ్చినా సరే, అటువంటి ఆఫర్స్ ని ఏ మాత్రం మిస్ కానివ్వటం లేదు. ఇదిలా ఉంటే, తాజాగా ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై రాశి ఖన్నా , ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..
రాశి ఖన్నా గోపీచంద్ సరసన నటించిన లేటెస్ట్ మూవీ మార్చి 27న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఇలా, తెలుగులో వరుసగా హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మంచి ఆఫర్ వస్తే, ఐటమ్ సాంగ్స్ చెయ్యడానికి కూడా సిద్దమేనని రాశి ఖన్నా తెలిపింది.
దీంతో తాజా సమాచారం ప్రకారం, అక్కినేని నవతరం వారసుడు అఖిల్ అక్కినేని హీరోగా, వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చెయ్యడానికి రాశి ఖన్నా సైన్ చేసింది. చాలా మాస్ బీట్ తో సాగే ఈ పాట, ఓ విలేజ్ వాతావారణంలో తెరకెక్కుతుంది.
త్వరలోనే ఈ సాంగ్ ని షూట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సాంగ్ లో రాశి ఖాన్నా కురచ దుస్తులతో ప్రేక్షకులను వేడిక్కించటం ఖాయం అని అంటున్నారు.రాశి ఖన్నా ఈ విధంగా ఐటెం సాంగ్ చేయటం ద్వారా, ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ ని తీసుకుంటుందని క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి.
 
Top