ఈరోజు జాతీయ మీడియాకు చెందిన ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంజలి తన తొలి ప్రేమికుడి గుట్టు బయట పెట్టింది. ప్రస్తుతం అంజలి నటిస్తున్న ‘చిత్రాంగద’ సినిమా కోసం 7 కేజీల బరువు తగ్గి గ్లామర్ పెంచుకున్న ఈ తెలుగుతెర సీతమ్మ ఈ ఇంటర్వ్యూలో అనేక ఆ శక్తికర విషయాలకు సమాధానాలు ఇచ్చింది.
సినిమా రంగంలో తన పై వస్తున్న రూమర్ల గురించి అలాగే తాను ఒక నిర్మాతను పెళ్ళి చేసుకుంది అని వస్తున్న గాసిప్పుల గురించి స్పందిస్తూ తన పై ప్రేమ వ్యవహారానికి సంబంధించిన వార్తలు తాను రాజోలులో 6వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ఇటువంటి వార్తలు తనను వెంటాడుతూనే ఉన్నాయని తన పై తానే సెటైర్లు వేసుకుంది.
అంజలి రాజోలులో 6వ క్లాసు చదువుకుంటున్నప్పుడు ఆమె క్లాసులో అంజలితో పాటు చదువు కుంటున్న ఒక అబ్బాయి ఒక లవ్ లెటర్ ఇవ్వడం అప్పట్లో తాను చదువుకునే స్కూల్ లో సంచలనంగా మారిందట. అయితే ఆ ప్రేమికుదుని తప్పించు కోవడానికి అతడికి రాఖీ కట్టి అప్పట్లో ఆ సమస్య నుండి బయట పడిందట.
మరొక ఆసక్తి కర మైన విషయం ఏమిటంటే తన చిన్నతనంలో ‘నీవు పెద్ద అయ్యాక ఏమి అవుతావు ?’ అని తన స్కూల్ టీచర్ ప్రశ్నించి నప్పుడు తాను పెద్ద హీరోయిన్ ను అవుతానని సమాధానం చెప్పి తన టీచర్ మైండ్ బ్లాంక్ చేసానని చెపుతోంది. అంతేకాదు తాను ఇప్పటి వరకు 25 సినిమాలలో నటించానని చెపుతూ కోలీవుడ్ లో తాను టాప్ హీరోయిన్స్ లిస్టులోనే ఉన్నానని అంజలి చెపుతున్న ఎన్నో నమ్మలేని నిజాలు ఆ ఇంటర్వ్యూలో ఉన్నాయి..
 
Top