గ్లామర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు డిమాండ్ ఉంటుందో, అప్పుడే డిమాండ్
చేయాలనేది కామన్ పాయింట్. అయితే, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు
చేస్తున్న హీరోయిన్ దీక్షా సేత్ కి కోలీవుడ్ లో ఘోరంగా అవమానం జరిగిందంటూ
టాక్స్ వినిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే, వేదం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన దీక్షా సేథ్, ఆ తర్వాత వరుస అవకాశాలతో గ్లామరస్ హీరోయిన్ గా స్టార్ డంని సంపాదించింది. ఇక తాజాగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టిన దీక్షాకు మొదటి సినిమాతోనే బాక్సాపీస్ వద్ద నిరాశ ఎదురయింది. ‘లేకర్ హం దీవానే దిల్’ పేరుతో విడుదలైన ఆ సినిమా భారీ ఫ్లాప్‌గా నిలిచింది.
ఈ మూవీ అనంతరం తను ఓ కోలీవుడ్ కి చెందిన టాప్ హీరో సరసన నటించేందుకు ఆసక్తి చూపించింది. దీనికి సంబంధించిన చర్చల్లో దీక్షా సేత్ ని తీసుకోవటానికి అన్ని అగ్రిమెంట్స్ పూర్తయ్యాయి. ఆ తరువాత స్వయంగా హీరో నిర్మాతకి, డైరెక్టర్ కి ఫోన్ చేసి, హీరోయిన్ ని తప్పించాల్సిందిగా కోరాడు. దాంతో ఆ హీరో చేసిన వ్యవహారాన్ని పసిగట్టిన దీక్షాసేత్, ఎంతో బాధపడినట్టుగా కోలీవుడ్ వర్గాల్లో టాక్స్ వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, ప్రస్తుతానికి దీక్షాసేత్ కి కోలీవుడ్‌లో మంచి ఆఫర్ వచ్చింది. వినూత్న సినిమాల ద్వారా కోలీవుడ్‌లో మంచి దర్శకుడిగా పేరున్న సెల్వరాఘవన్ సినిమాలో హీరోయిన్ చాన్స్ దీక్షను వరించింది. శింబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్ళింది. ఇక సెల్వరాఘవన్ గత చిత్రం ‘ఇరండామ్ ఉలగమ్’ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో చాలా గ్యాప్ తరువాత వస్తున్న చిత్రం కావడంతో, పక్కా స్రిప్ట్ ని నమ్ముకుంటాడు సెల్వారాఘవన్.