లిప్ లాక్ సీన్లంటే హాలీవుడ్ కే పరిమితం అనుకొనే సమయంలో ఆ జాడ్యం కాస్త బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ కు కూడా పాకింది. రొమాంటిక్ సినిమాల్లో ఇది సర్వ సాధారణం అయిపోయింది. లెటెస్ట్ ట్రెండ్ ప్రకారం ఈ సీన్ల కు మరింత క్రేజ్ పెరిందనే చెప్పాలి. మరి ఈ లిప్ లాక్ సీన్లో అగ్ర తార నటిస్తే ఎంత్ర క్రేజీగా ఉంటుందో ఊహించుకోండి.
తమిళనాట హీరో విజయ్ కి ఎంత క్రేజ్ ఉందో అందకీ తెలుసు మనోడు నటించిన సినిమాలు దాదాపు హిట్ టాకే. అయితే విజయ్ నటిస్తున్న పులి షుటింగ్ జోరుగా సాగుతుంది. ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రగా అతిలోక సుందరిగా అలనాడు అందరి మనసు దోచిన శ్రీదేవి ఒక మహరాణి పాత్రలో నటిస్తున్నట్లు తెలియవచ్చింది.
అంతే కాదు ఈ సినిమాలో మహరాజు పాత్రలో కన్నడ నటుడు ‘ఈగ’ ఫేమ్ కిచ్చ సుదీప్ కూడా నటిస్తున్నాడట. వీరిద్దరి మధ్య ఓక ఘాటైన లిప్ లాక్ సీను ఉందట? ఈ సీన్ తర్వలో చిత్రీకరించనున్నారట ! విషయమేమిటంటే ఈ చిత్ర కథకు ఈ సీన్ చాలా ప్లస్ పాయింట్ అవుతుందట అందుకే ఈ సీన్ కి ఆమె ఓకే కూడా చెప్పినట్లు తెలుస్తుంది ?
ఇప్పటికీ శ్రీదేవి గ్లామర్ ఏమాత్ర తగ్గలేదు. ఈమె నటించిన సినిమాలకు ఎంత క్రేజ్ ఉండేదో దాదాపు నాటి అగ్ర హీరోలు అందరితో నటించి మరి ఈ చిత్రంలో ఎలా మెప్పించనుందో వేచి చూడాలి. వావ్ మరి ఈ సీన్ వెండి తెరపై చూస్తే ఎంత మంది మతులు పోతాయో బాబోయ్ అని అనుకుంటున్నారు సినీ ప్రేమికులు.
 
Top