సాయి ధరమ్ తేజ్ బాలీవుడ్ బ్యూటీ అదాశర్మకు అనుకోని ట్విస్ట్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ మెగా హీరో హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రను ఆదాశర్మ చేయడానికి అంగీకరించినట్లు టాక్. ఈ సినిమాలోని ఆదాశర్మ పాత్ర సినిమా మూల కథకు ట్విస్ట్ ఇచ్చే పాత్రగా మారబోతోంది అని తెలుస్తోంది.
ఈ సినిమాలో ఆదాశర్మ కనిపించేది కొన్ని నిముషాలు మాత్రమే అయినా చాల గ్లామరస్ లుక్ తో ఇండియన్ మరియు వెస్ట్రన్ కాస్ట్యూమ్స్ తో యూత్ ను ఇట్టే ఆకట్టుకుంటుంది అని టాక్. సాయి ధరమ్ తేజ్, ఆదాశర్మల మధ్య ఒక స్పెషల్ సాంగ్ కు కూడా దర్శకుడు హారీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడట.
ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న రెజీనా గ్రామీణ నేపధ్యంతో ఉన్న పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తూ ఉండటంతో యూత్ ను ఆకట్టుకోవడానికి ఆదాశర్మ గ్లామర్ ను ఎక్స్ పోజ్ చేస్తూ ఈ పాత్ర డిజైన్ చేసారని టాక్.
ప్రస్తుతం అల్లుఅర్జున్ తో ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ఆదితో ‘గరమ్’ సినిమాలలో నటిస్తున్న ఆదాశర్మ కెరియర్ సక్సస్ అంతా బన్నీ సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ పై ఆధార పడి ఉంది. ఈ సినిమా అనుకున్న విధంగా హిట్ అయితే టాలీవుడ్ కు మరో గ్లామర్ హీరోయిన్ గా ఆదాశర్మ సెటిల్ అవ్వడం ఖాయం..
 
Top