సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న బ్యూటీ
సమంత. ప్రస్తుతం సమంత హీరోయిన్ గా చేస్తున్న మూవీలు అన్నీ, బాక్సాపీస్ వద్ద
బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకుంటున్నాయి. దీంతో సమంతకి సౌత్ ఫిల్మ్
ఇండస్ట్రీలో భారీ క్రేజ్ క్రియేట్ అవుతుంది. ఇదిలా ఉంటే త్వరలోనే సమంత ఓ
స్టన్నింగ్ రోల్ లో నటించే అవకాశం ఉందని, కోలీవుడ్ వర్గాల నుండి క్లియర్ గా
టాక్స్ వినిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే, కంగన రనౌట్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘క్వీన్’ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాని తెలుగులో, అలాగే సౌత్ లాంగ్వేజస్ లో రీమేక్ చేయడానికి ఫేమస్ తమిళ నటుడు, డైరెక్టర్ అయిన త్యాగరాజన్ రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నాడు. రీమేక్ రైట్స్ తీసుకున్న రోజు నుంచి ఈ సినిమాలో కంగన పాత్ర చేయడానికి సరిపోయే పర్ఫెక్ట్ నటి కోసం త్యాగరాజన్ అన్వేషిస్తున్నారనే విషయం తెలిసిందే.
మొదటి నుండి ఈ పాత్రలో త్రిషని కాని, సమంతని కాని ఫైనలైజ్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా త్రిష, త్యాగ రాజన్ కి క్వీన్ రిమేక్ లో నటించే ఉద్ధేశం లేదని క్లియర్ గా చెప్పిందట. దీంతో త్యాగరాజన్, సమంతని ఓకె చేశాడని టాక్స్ వినిపిస్తున్నాయి. ఇందుకు సమంత కూడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.
త్యాగరాజన్ సౌత్ ఇండియన్ భాషలకి సరిపోయేలా ఒక హీరోయిన్ ఉంటే బాగుంటుదని నిర్ణయించుకున్నారు కాబట్టి, సమంత పేరుని త్వరలోనే అఫిషియల్ అనౌన్స్ మెంట్ ద్వార చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. అయితే సమంత, కంగన రనౌత్ స్థాయిలో చేయగలదా? అనేదే ప్రశ్నార్ధకంగా మారింది. ఈ మూవీలో కంగనా ఫుల్ గా తాగి చిందులు వేసే సీన్స్ చాలానే ఉంటాయి. ఆ విధంగా సమంత కూడ చేయగలుగుతుందా? అని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.