రేణు దేశాయ్ తన కుమార్తె ఆద్య తన స్కూల్ లో చేసిన క్లాసికల్ డాన్స్ ఫోటోను తన ఫేస్ బుక్ ట్విటర్ లలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఒక మహేష్ వీరాభిమాని రేణు దేశాయ్ ట్విట్ ను చూసి ఆద్య ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ ఏడి? అని ప్రశ్నించడమే కాకుండా ప్రిన్స్ మహేష్ బాబు తన కుమారుడు గౌతమ్ చదువుతున్న స్కూల్ ఫంక్షన్ లో పాల్గొన్న మహేష్ ఫోటోలను, రేణు దేశాయ్ కి రీ ట్విట్ చేసి పంపుతూ చేసిన కామెంట్స్ రేణుకు విపరీతమైన అసహనాన్ని కలిగించినట్లుగా తెలుస్తోంది.
దీనితో కోపగించుకున్న రేణు తన ట్విట్ లో వాడిన ఇంగ్లీష్ పదాలు అర్ధం చేసుకునే స్థాయి లేకపోతే కామెంట్స్ చేయకుండా మౌనంగా ఉండాలి కాని ఎదుటి మనిషిని కించపరిచే విధంగా ట్విట్స్ పెట్ట వద్దని మహేష్ అభిమానికి క్లాసు పీకింది రేణు.
అంతేకాదు టాప్ హీరోల అభిమానుల ప్రవర్తన వారు అభిమానించే హీరోలకు చెడ్డ పేరు తెచ్చి పెట్టేలా ఉండకూడదని వరసపెట్టి ట్విట్స్ పెడుతూ మహేష్ అభిమానిని టార్గెట్ చేసింది రేణు దేశాయ్.
ఆమధ్య సమంత మహేష్ పై కామెంట్స్ చేస్తే మహేష్ అభిమానులంతా ఆమె పై విరుచుకు పడ్డారు. మరి రేణు మహేష్ అభిమానిని టార్గెట్ చేసిన వ్యవహారం ఇక్కడితో ముగిసి పోతుందా? లేదంటే ఇంకా కొనసాగుతుందా అన్న విషయం రానున్న రోజులలో తేలుతుంది.
 
Top