పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ గబ్బర్ సింగ్ 2. ఈ మూవీకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తయింది. పవన్ కళ్యాన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఇక సెట్స్ మీదకు వెళ్ళటమే. అయితే పవన్ మాత్రం ఇందుకు రెడీగా లేడు. విషయంలోకి వెళితే, పవన్ ఈ సంవత్సరం ‘గోపాల గోపాల’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు.
ఈ మూవీ అనంతరం వెంటనే స్టార్ట్ కావాల్సిన గబ్బర్ సింగ్2ని కొంత కాలం పోస్ట్ పోన్ చేశాడు. ‘గబ్బర్ సింగ్ 2′ ఎక్కువ భాగం 2015 సెకండాఫ్ లోనే స్టార్ట్ అవుతుందని, 2016 మొదట్లో ఈ సినిమాని రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ బ్రేక్ తీసుకోవడానికి రీజన్ ఏమిటనేది తెలుసుకుంటే, టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, పవన్ కి ఉన్న బ్యాక్ పెయిన్ కారణంగా చెబుతున్నారు.
ఈ సమస్య గత రెండు సంవత్సరాలుగా పవన్ ని వేధిస్తుందంట. తన వెన్ను సమస్యకి థెరిపీ చికిత్స విధానాన్ని తీసుకున్న తరువాతే, గబ్బర్ సింగ్2 కి సంబంధించిన షూటింగ్స్ లో పాల్గొంటాడని చిత్ర వర్గాల నుండి అందుతున్న సమాచారం. పవన్ నటించనున్న గబ్బర్ సింగ్ 2 సినిమాకి బాబీ దర్శకత్వం వహించనున్నాడు.
గబ్బర్ సింగ్2 తరువాత కూడ పవన్ కళ్యాణ్ ఓ మూవీలో నటించటానికి డేట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలను రిలీజ్ చేసుకోవటానికి ప్లాన్స్ వేసుకున్నట్టుగా టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.
 
Top