సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన మూవీ లింగా. లింగా మూవీ బడ్జెట్ దాదాపు 150 కోట్ల
రూపాయలను టచ్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. అయితే నిజానికి ఈ మూవీ 100 నుండి 115 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించబడింది. తాజాగా రిలీజ్ అయిన లింగా మూవీ, బాక్సాపీస్ వద్ద డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇంత భారీ బడ్జెట్ తో రిలీజ్ అయిన మూవీకి కలెక్షన్స్ భారీగా ఉంటాయని అందరూ ఊహించారు. అయితే థియోటర్ కి వచ్చిన సినీ ప్రేక్షకులు అంతా, కేవలం రజనీకాంత్ కోసం మాత్రమే వచ్చారు తప్పితే, మూవీ గ్రాండ్ సక్సెస్ ని సాధిస్తుందనే నమ్మకంతో మాత్రం రాలేదనిపిస్తుంది. ఇక్కడే రజనీకాంత్ సేఫ్ అయ్యాడు. అలాగే లింగ మూవీ కూడ పెద్దగా చిక్కుల్లో పడలేదు. ఎందుకంటే లింగ మూవీని చూసిన సగటు ప్రేక్షకులు రజనీకాంత్ ని చూశాము కాని స్టోరి బాగోలేదు, రజనీకాంత్ సూపర్ అంటూ కామెంట్స్ ఇస్తున్నాడు. దీంతో మూవీకి రిపీట్ ఆడియోన్స్ పోయారు. దీనివల్ల మూవీ స్టోరి బాగుండలేదు అనే టాక్ తో మొదటి వారం అనంతరం లింగ మూవీకి కలెక్షన్స్ దారుణంగా పడిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కోలీవుడ్ లోనూ రజనీకాంత్ గురించి తెగ చెబుతున్నారు తప్పితే, లింగ కథ గురించి పెద్దగ చెప్పుకోవడంలేదంట. మొత్తంగా మూవీకి బాక్సాపీస్ రిపోర్ట్స్ చూసుకుంటే దాదాపు 23 కోట్ల రూపాయలను నష్టపోవల్సిందే అని ట్రేడ్ రిపోర్ట్స్ లెక్కలు చెబుతుంది. అయితే ఇదంతా నిర్మాతే భరించాల్సి వస్తుందంటే పొరబాటే. అయితే కొంత భారాన్ని మాత్రం మోయాల్సిందే. ఇప్పటికే నిర్మాత సేఫ్ గేమ్ ఆడి, కొంత ఒడ్డున పడ్డాడు. ఇక ఈ నష్టాన్ని భరించాల్సింది డిస్ట్రిబ్యూటర్స్, థియోటర్ యజమానులే అని అంటున్నారు. లింగ మూవీ రిలీజ్ కంటే ముందుగానే దాదాపు 60 కోట్ల రూపాయల బిజినెస్ చేసుకొని నిర్మాత తన తెలివిని చూపాడు. మొత్తానికి నాలుగేళ్ల తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘లింగ’ సినిమా రజినీ అభిమానులను మాత్రమే సంతృప్తి పరచగలిగింది. రజినీకాంత్ నుంచి ఆశించే బేసిక్ మారిజమ్స్, పంచ్ డైలాగ్స్ కూడా ఇందులో లేకపోవడంతో ఆడియన్స్ తీవ్ర నిరాశకి గురవుతారు.
 
Top