పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ గోపాల గోపాల. ఈ
మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. అలాగే పోస్ట్
ప్రోడక్షన్ కూడ కొద్ది పనులు మినహా, దాదాపు మిగతాది అంతా పూరైంది. ఇదిలా
ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఓ సరికొత్త విషయం ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని
అలరిస్తుంది. గతంలో ‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ సినీ
ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. ఇక పవన్ ఫ్యాన్స్ ని అయితే ఆ పోస్టర్స్
తెగ సంతోష పెట్టిందనే చెప్పాలి. మోషన్ పోస్టర్ ని చూసిన ఫ్యాన్స్, గోపాల
గోపాల టీజర్ ని చూడాలని, అలాగే ట్రైలర్ చూడాలని తెగ సంబరపడుతున్నారు.
అందుకే ఇప్పుడు అభిమానులని సంతోష పరచాలని పవన్ కళ్యాణ్ రెడీ అయిపోయాడు.
అందుకు తగ్గట్టుగానే గోపాల గోపాల చిత్ర యూనిట్ కూడ ప్రయత్నాలను చేస్తుంది.
మరోవైపు విక్టరీ వెంకటేష్ అభిమానులు సైతం ఈ గోపాలగోపాల మల్టీస్టారర్ ఫిల్మ్
టీజర్ కోసం ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. డిసెంబర్ 13న, విక్టరీ వెంకటేష్
పుట్టిన రోజు సందర్భంగా ‘గోపాల గోపాల’ ఎక్స్ క్లూజివ్ స్టిల్స్ బయటకు
రానున్నాయి. కేవలం వెంకటేష్ సంబంధించిన స్టిల్స్ మాత్రమే కాకుండా పవన్
కళ్యాణ్ కి సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టిల్స్ బయటకు రిలీజ్
చేస్తున్నారు.
వీటితో పాటు టీజర్ ని కూడ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. మొదట
స్టిల్స్ ని రిలీజ్ చేసి, తరువాత టీజర్ ని రిలీజ్ చేయవచ్చని చిత్ర యూనిట్
నుండి అందిన సమాచారం. పవన్ కళ్యాణ్ ని వెంకటేష్ పిలిచే డైలాగ్ ఆ టీజర్ లో
ఉండే అవకాశం ఉందని అంటున్నారు. గోపాల గోపాల మూవీలో వెంకటేష్ సరసన శ్రియ
హీరోయిన్ గా నటిస్తున్నారు. కిషోర్ పార్దసాని డాలీ ఈ మూవీకి దర్శకత్వం
వహిస్తున్నాడు.