‘ఫోర్బ్స్ ఇండియా' లేటెస్ట్ టాప్ 100 సెలబ్రిటీల ఆదాయం లిస్ట్ లో మహేష్ బాబు 51 కోట్ల ఆదాయంతో 30వ స్థానంలో చాలామంది టాప్ హీరోలను మించి నిలవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. అయితే మన టాలీవుడ్ సెలెబ్రెటీల ఆదాయపు లిస్టులో మహేష్ బాబుది ప్రధమస్థానం. ఈ సంవత్సరం ‘ఫోర్బ్స్ ఇండియా’ పత్రిక ప్రకటించిన టాప్ టెన్ ర్యాంకింగ్స్ లో ముగ్గురు మినహా అందరూ సినిమా సెలెబ్రెటీ లే కావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  సంపాదన విషయంలో మహేష్ 30వ ర్యాంక్ లో నిలిస్తే టాలీవుడ్ ఎంపరర్ పవన్ కళ్యాణ్ 16 కోట్ల రూపాయల సంపాదనతో 74వ స్థానంలో ఉంటే 11.5 కోట్ల సంపాదనతో అల్లుఅర్జున్ ఆ తరువాత స్థానాలలో నిలిచాడు. ఇకపోతే బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ 244.50 కోట్ల సంపాదనతో ప్రధమ స్థానంలో ఉంటే ఆయన తర్వాత స్థానల్లో అమితాబ్ బచ్చన్ 196 కోట్లు, షారుక్ ఖాన్ 202 కోట్ల సంపాదనతో తమ స్థాయిని చాటుతున్నారు.  ఈ విషయంలో అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దక్షిణ భారత సినిమా రంగ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సంవత్సరానికి సంబంధించి 37 కోట్ల సంపాదనతో 45వ స్థానంలో ఉండటం వలన ఆదాయం విషయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన స్థాయికి మించిన షాక్ ఇచ్చాడు అనుకోవాలి.  కేవలం సినిమాలకు సంబంధించి సెలెబ్రెటీలకు వస్తున్న ఆదాయమే కాకుండా బ్రాండ్ ఎండార్స్ మెంట్లు ద్వారా సెలెబ్రెటీ లు తీసుకుంటున్న ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్స్ ను ‘ఫోర్బ్స్ ఇండియా’ పత్రిక విడుదల చేసింది..   
 
Top