ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన బ్యూటీ శ్రీదేవి. ఇప్పటికీ శ్రీదేవి అంటే యంగ్ హీరోల గుండెలు జివ్వుమంటాయి. అటువంటి వారిలో మన టాలీవుడ్ కి చెందిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఇదిలా ఉంటే తాజాగా శ్రీదేవి ఓ మూవీలో నటించేదుకు దాదాపు 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ని తీసుకుంటుందనే టాక్స్ హాట్ టాపిక్ గా వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళితే, విజయ్ హీరోగా శింబు దేవన్ దర్శకత్వంలో తమిళంలో ఓ సోషియో ఫ్యాంటసీ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీదేవి మహారాణి పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాలో తను చేస్తున్న మహారాణి పాత్ర కోసం శ్రీదేవి, కత్తి యుద్ధానికి సంబంధించిన నైపుణ్యాల కోసం శిక్షణ తీసుకోవల్సిందిగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. శ్రీదేవికి సంబంధించిన కొన్ని సీన్స్ లో కత్తి యుద్ధం అనేది రెండు నిముషాల వరకూ ఉంటుందనేది కోలీవుడ్ రిపోర్ట్. అలాగే సిన్ డిమాండ్ మేరకు మహారాజు, మహారాణిల మధ్య ముద్దు సన్నివేశాలు ఉంటాయంట. దర్శకుడు శింబుదేవన్ ఈ విషయాన్ని శ్రీదేవితో ముందుగానే చెప్పాడంట. అందుకు శ్రీదేవి కూడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకే తను దాదాపు అయిదు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాని దాదాపు 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే శింబుదేవన్ మూవీలో శ్రీదేవి లిప్ లాక్ సీన్స్ అంటూ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా టాక్స్ వినిపిస్తున్నాయి. దీనిపై శ్రీదేవి ఏ విధంగా స్పంధిస్తుందో చూడాలి మరి.
 
Top