దేశంలో స్త్రీల పై రోజురోజుకు అత్యా చారాలు పెరిగి పోతున్న నేపధ్యంలో ఈ
విషయంలో హీరోయిన్స్ కూడా మినహాయింపు కాదు అని చెప్పే ఒక సంచలన విషయం కొద్ది
రోజుల క్రితం ముంబాయిలో జరిగింది. చిరంజీవి ‘శంకర్ దాదా ఎమ్.బి.బిఎస్’
సినిమాలో ‘నా పేరే కాంచనమాల’ అంటూ చిరంజీవితో ఐటమ్ సాంగ్ చేసిన గౌహర్ ఖాన్
చిరంజీవితో ఆ సినిమాలో నటించాక టాలీవుడ్ లో పెద్దగ అవకాశాలు రాకపోవడంతో
బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ హిందీలో ప్రసారం అవుతున్న కొన్ని బుల్లితెర
రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.
ఈ నేపధ్యంలో ఆమె ప్రస్తుతం ‘ఇండియస్ రా స్టార్’ అనే రియాల్టిషోకు
హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. అయితే ఆమెఈ షోకు సంబంధించి ఒక ఐటమ్ సాంగ్
షూటింగ్ కు రెడీ అవుతున్న సందర్భంలో ఆమె ప్రాక్టీస్ చేస్తున్న ఆ రియాలిటీ
షో స్టేజ్ మీదకు అప్పటి వరకు ప్రేక్షకులలో కూర్చున్న మొహద్ షఫీ అనే యువకుడు
ఆవేశంగా స్టేజ్ పైకి వచ్చి ఆమె చుట్టూ ఉన్న బౌన్సర్లను దాటుకుని ఒక
ముస్లిమ్ యువతివి అయి ఉండి ఇంత అసభ్యకరంగ డ్రెస్ చేసుకుని రియాలిటీ షోలో
నటిస్తావా అంటూ ఆమెను పిడి గుద్దులతో చితక బాదాడు అని వార్తలు వస్తున్నాయి.
అనుకోని ఈ సంఘటనకు షాక్ అయిన గౌహర్ ఖాన్ తేరుకోవడానికి చాల సమయం పట్టిందని
టాక్. చాల మంది హీరోయిన్స్ ను ఇంకా హాట్ గా చూపెట్టండి అని కోరుతున్న
నేపధ్యంలో ఇలా హాట్ గా తయారైన గౌహర్ ఖాన్ కు ఎదురైన అనుభవం విచిత్రంగానే
ఉంది