సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఉంటుంది. కాని ముఖ్యంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి ఉండే మర్యాద పూర్వకరమైన క్రేజ్ ఎక్కడా దొరకదనే చెప్పాలి. సౌత్ హీరోయిన్స్ కి ఏదైనా షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఆఫర్ వస్తే, దాదాపు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తారు. నిజానికి వారు ఓ సినిమా కోసం 20 రోజుల పాటు కష్టపడితే ఎంత రెమ్యునరేషన్ వస్తుందో అందులో దాదాపు సగం రెమ్యునరేషన్, కేవలం ఓ గంట పాటు జరిగే షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళితే చాలు. ఇట్టే సంపాదించేస్తారు. సరిగ్గా ఇలాంటి ఆఫర్, సౌత్ బ్యూటీ కాజల్ కి వచ్చింది. కాజల్ కి రీసెంట్ గా ఓ షాపింగ్ మాల్ కి ఓపెనింగ్ చేయాలని ఆఫర్ వచ్చింది. అయితే అలా చేసేందుకు, దాదాపు 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ని కాజల్ డిమాండ్ చేసింది. వెంటనే వారు కాదనుకుండా కాజల్ కి దాదాపు సగం పేమంట్ ని అడ్వాన్స్ గా ఇచ్చేశారు. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. కార్పోరేట్ రంగానికి చెందిన ఓ సంస్థ, ఇప్పుడు రిటైల్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది. వారు మరో రెండు నెలల్లో దాదాపు ఇండియా వ్యాప్తంగా 7 స్టోర్స్ ని ప్రారంభిస్తున్నారు. వాటిలో సౌత్ ఇండియాలోనే 4 స్టోర్స్ పెట్టబోతున్నారు. అందుకే కాజల్ ని వారి రిటైల్ బ్రాండ్ ని అంబాసిడర్ గా నియమించుకోవాలని, తనతో డీల్ కుదుర్చుకున్నారు. ఈ డీల్ లో తను చేయాల్సిందల్లా సౌత్ లో ఉన్న నాలుగు స్టోర్స్ ప్రారంభోత్సవానికి ఓ రెండు గంటలు కేటాయిస్తే చాలు అట. ఆ చేసినందుకు వీరు కాజల్ కి దాదాపు 2 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా ఇస్తున్నారు. ఈ డీల్ ని తెలుసుకున్న కొందరు హీరోయిన్స్, కాజల్ ని చూసి తెగ అసూయ పడుతున్నారంట.
 
Top