క్రేజీ హీరోయిన్ కాజల్ కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదగాలని చాల ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం ఆమె తన పారితోషికాన్ని కూడా తగ్గించుకుని అక్కడ సమంతా, హన్సికల స్పీడ్ కు బ్రేక్ వేయాలని అనేక పాట్లు పడుతోంది. ఈ మధ్య కాలంలో ఆమెకు అదృష్టం కలిసి వచ్చి ధనుష్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై కాజల్ పెద్ద ఆశలే పెట్టుకుంది. ఈమధ్యన ఈ సినిమా షూటింగ్ లో ధనుష్ కాజల్ కోసం ఒక అరుదైన బహుమతి ఇచ్చాడట. ప్రఖ్యాత నవలా రచయిత కాన్ ఇగ్లూడెన్ రచించిన తాజా 5సిరీస్ ల నవల అది. ఈ పుస్తకాలను ధనుష్ దగ్గర నుంచి అందుకున్న తరువాత ఈ నవలను వరస పెట్టి చదివేస్తూ కాజల్ ఈ సినిమా షూటింగ్ లో చాల హడావిడి చేస్తోందని టాక్.  అంతేకాదు ఈ నవల ఇచ్చిన ప్రేపరణతో కాజల్ రచయిత్రిగా మారిపోయి ఒక పుస్తకాన్ని కూడా రాస్తానని చెపుతోంది. ఈ పుస్తకంలో తాను ఇప్పటి వరకు చూసిన వివిధ దేశాల విషయాలు అక్కడ తాను కలిసిన వివిధ వ్యక్తుల జీవితాలను గురించి తాను రాయబోయే పుస్తకంలో రాస్తానని చెపుతోంది కాజల్. ఇప్పటికే పెరిగిపోయిన హీరోయిన్స్ పోటీ మధ్య అవకాశాల కోసం అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ మధ్య చెక్కర్లు కొడుతున్న కాజల్ భవిష్యత్ లో సినిమాలు లేకపోతే ఇలా నవలలు రాసుకుంటూ కాలం గడిపేద్దామని ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తోంది కాబోలు..
 
Top