సినిమాలలో వచ్చే రొమాంటిక్ సీన్స్ ను యూత్ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ సీన్స్ లో నటించడం తనకు తల నొప్పిగా మారింది అంటూ మిల్కీ బ్యూటీ తమన్నా సంచలన కామెంట్స్ చేసింది. ఎక్స్ పోజింగ్ విషయంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే తమన్నా ఇలా మాట్లాడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ మధ్య ఒక ప్రముఖ హీరోతో తమన్నా నటించిన రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించిన ఒక ప్రముఖ దర్శకుడు ఆ సీన్ లో తమన్నా ఆ హీరోతో ఎంత సన్నిహితంగా నటిస్తున్నా ‘ఇంకా దగ్గరకు రండి ఇంకా గట్టిగా హత్తుకొండీ అని ఆ డైరెక్టర్ తన మైక్ లో చెపుతూ ఉంటే ఆ సీన్ లో నటిస్తున్న తమన్నాకు ఒళ్ళు మండి పోయిందట. అయితే తప్పదు కాబట్టి కష్టపడి ఆ సీన్ పూర్తి చేసాను అని అంటూ తమన్నా దాదాపు వంద మంది మధ్య అన్ని లైట్ల మధ్య కష్టపడి రొమాంటిక్ సీన్స్ నటిస్తే ప్రేక్షకులు తమన్నా ఇంకా బాగా హాట్ గా నటిస్తే బాగుండేది అని కామెంట్స్ చేయడం చూస్తూ ఉంటే తనకు ఒకొక్కసారి ఏడుపు వస్తుందని తన బాధను ఒక ఇంటర్వ్యూలో వెళ్ళ గక్కింది తమన్నా.  అంతేకాదు తీరా తాను ఇన్ వాల్వ్ అయి క్లోజ్ గా ఆ హీరోతో నటిస్తే తమ పై లేనిపోని రాతలు రాసేస్తున్న మీడియాను చూస్తూ ఉంటే కోపం వచ్చినా ఏమి అనలేక తన బాధను దిగ మింగు కుంటున్నాను అని గగ్గోలు పెడుతోంది తమన్నా..
 
Top